భారత జట్టులో ఎవరి సత్తా ఎంత?, ప్రపంచ కప్‌లో ఫేవరైట్లు

1. వీరేంద్ర సెహ్వాగ్ (1999) - 214 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 35, స్ట్రయిక్ రేట్ 103, బౌలింగ్ సగటు 40, ఎకనమీ రేటు 5.3. గణాంకాలను పక్కన పెట్టినా ఓపెనర్‌గా సెహ్వాగ్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. అఫ్రదీ తర్వాత ఉత్తమ స్ట్రయిక్ రేటు సాధించిన బ్యాట్స్‌మన్ సెహ్వాగే. పార్ట్ టైమ్ బౌలర్‌గా భారత్‌కు ఎంతో ఉపయోగపడిన చరిత్ర ఉంది.
2. సచిన్ టెండూల్కర్ - 420 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 45, స్ట్రయిక్ రేటు 86, బౌలింగ్ సగటు 44, ఎకనమీ రేటు 5.1. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాడు.
3. గౌతం గంభీర్ (2004) - 97 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 40, స్ట్రయిక్ రేటు 87, ఇంపాక్ట్ ఇండెక్స్ 1.93. గౌతం గంభీర్ నిలకడైన, సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా ముందుకు వచ్చాడు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి అతనికి ఉంది.
4. విరాట్ కోహ్లీ (2008) - 43 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 46, స్ట్రయిక్ రేటు 82. విరాట్ కోహ్లీ భారత జట్టు మూడో అత్యుత్తమ వన్డే క్రీడాకారుడు. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ తర్వాతి స్థానం అతనిదే. ఒత్తిడిని తట్టుకోవడంలో యువరాజ్, ద్రావిడ్‌లకు సాటి వస్తాడు. ప్రస్తుత జట్టులో యువరాజ్, సురేష్ రైనాలతో పాటు మంచి ఫీల్డర్.
5. యువరాజ్ సింగ్ (2000) - 253 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 37, స్ట్రయిక్ రెట్ 88, బౌలింగ్ సగటు 39, ఎకనమీ రేటు 5. మ్యాచును మలుపు తిప్పే ఆటగాడు. మంచి బౌలర్, భారత ఫీల్డర్లలో అగ్రస్థానం యువరాజ్‌దే. ఫిట్నెస్, గాయాలు అతని సమస్య.
6. ఎంఎస్ ధోనీ (2004) - 167 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 49, స్ట్రయిక్ రేటు 89. భారత జట్టుకు విజయాలను రుచి చూపిస్తున్న కెప్టెన్. మంచి వికెట్ కీపర్, అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు.
7. యూసుఫ్ పఠాన్ (2008) - 43 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 33, స్ట్రయిక్ రేటు 115, బౌలింగ్ సగటు 35, ఎకనమీ రేటు 5.6. ఒత్తిడిని అద్భుతంగా తట్టుకోగల క్రీడాకారుడు. స్ట్రయిక్ రేటులో సెహ్వాగ్ తర్వాతి స్థానం యూసుఫ్ పఠాన్‌దే. మ్యాచును మలుపు తిప్పగల బ్యాట్స్‌మన్.
8. హర్భజన్ సింగ్ (1998) - 202 మ్యాచులు, బౌలింగ్ సగటు 33, ఎకనమీ రేటు 4.3. భారత ఉత్తమ స్పిన్ బౌలర్. జట్టులో కీలక పాత్ర పోషించగలడు. లోయర్ ఆర్డర్‌లో ప్రత్యర్థులకు ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ కూడా.
9. జహీర్ ఖాన్ (2000) - మ్యాచులు 172, బౌలింగ్ సగటు 30, ఎకనమీ రేటు 4.9. శ్రీశాంత్ తర్వాత రెండో ఉత్తమ భారత బౌలర్ ఇతను. భారత్‌కు విజయాలను అందించడంలో కీలక పాత్ర ఇతనిది.
10. మునాఫ్ పటేల్ (2006) - మ్యాచులు 50, బౌలింగ్ సగటు 30, ఎకనమీ రేటు 4.8. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాన్ని దెబ్బ తీయడంలో దిట్ట. ప్రవీణ్ తప్పుకోవడంతో ఇతనికి అవకాశం లభించింది.
11. ఆశిష్ నెహ్రా (2001) - 111 మ్యాచులు, బౌలింగ్ సగటు 32, ఎకనమీ రేటు 5.2. తగిన విధంగా తన ప్రతిభను చాటడంలో విఫలమవుతున్నాడు. అయితే, అత్యంత ప్రధానమైన ఆటగాడు.
బెంటీ ఆటగాళ్లు
సురేష్ రైనా (2005) - 107 మ్యాచులు, బ్యాటింగ్ సగటు 35, స్ట్రయిక్ రేటు 90. ఒత్తిడి తట్టుకునే భారత బ్యాట్స్‌మెన్‌లో ఇతను ఒకడు. బౌలింగ్ కూడా చేయగలడు.
రవిచంద్రన్ అశ్విన్ (2010) - 7 మ్యాచులు, బౌలింగ్ సగటు 23, ఎకనమీ రేటు 4.9. ప్రస్తుత యువ ఆటగాళ్లలో మంచి ప్రతిభ గలవాడు. అయితే, అతని ప్రతిభపై ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితిని అతను ఆడిన 6 మ్యాచులు కల్పించాయి.
ఎస్. శ్రీశాంత్ (2010) - 47 మ్యాచులు, బౌలింగ్ సగటు 32, ఎకనమీ రేటు 6.0. ప్రవీణ్ కుమార్ గాయం కారణంగా తప్పుకోవడంతో ప్రపంచ కప్ జట్టులో శ్రీశాంత్‌కు స్థానం లభించింది. టెస్టుల్లో మాదిరిగా వన్డేల్లో అంతగా రాణించలేకపోయాడు. భారత పరిస్థితులు అతనికి అనుకూలిస్తాయని భావిస్తున్నారు.
పియూష్ చావ్లా (2007) - 22 మ్యాచులు, బౌలింగ్ సగటు 34, ఎకనమీ రేటు 4.9. ప్రయోజనకరమైన స్పిన్ బౌలర్. అశ్విన్‌కు తొలి 11 మంది జట్టు సభ్యుల్లో స్థానం లేకుంటే ఆ స్థానం పియూష్ చావ్లాదే.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications