ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 516

ఆస్ట్రేలియాకు ఫాలో ఆన్ ఇవ్వకుండా భారత్ తన రెండో ఇన్నింగ్సును ఆదివారం సాయంత్రం ప్రారంభించింది. మిశ్రా బౌలింగుకు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా వంద పరుగులు చేసింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా 268 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ 201 పరుగుల ఆధిక్యంలో ఉంది. అమిత్ మిశ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్, హర్భజన్ చెరో రెండు వికెట్లు, జహీర్ ఒక వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా ఆదివారం ఉదయం క్రీజులోకి వచ్చిన క్లార్క్ (27) అమిత్ మిశ్రా ఎల్బీడబ్ల్యూ రూపంలో, హస్సీ (54)ని ఇశాంత్ శర్మ కీపర్ క్యాచ్ ద్వారా, హాడిన్ (9)ను క్లీన్ బౌల్డ్ ద్వారా హర్భజన్ పెవిలియన్ బాట పట్టించారు. వాట్సన్, బ్రెట్ లీ ఫాలో ఆన్ ప్రమాదం నుంచి ఆస్ట్రేలియాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వారు భారత బౌలర్లను స్థిరంగా ఎదుర్కున్నారు. వాట్సన్ 78 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. బ్రెట్ లీ 35 పరుగులు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 469 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (102), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (92), సచిన్ టెండూల్కర్ (88), గంభీర్ (67), సెహ్వాగ్ (35), ద్రావిడ్ (39)లు రాణించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యపడింది. ఆసీస్ బౌలర్లలో సిడిల్, జాన్సన్‌లు మూడేసి వికెట్లు పడగొట్టగా, వైట్ రెండు, బ్రెట్ లీ ఓ వికెట్ దక్కించుకున్నారు. జహీర్ ఖాన్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
Story first published: Monday, October 20, 2008, 14:29 [IST]
Other articles published on Oct 20, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications