బెంగుళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ టిక్కెట్ల సందడి మొదలైంది. బెంగుళూరులోని ఎమ్ చిన్నసామి స్టేడియంలో నవంబర్ 14 నుంచి 18 (శనివారం నుంచి బుధవారం) వరకు జరగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కి ఈరోజు నుంచి టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో టెస్టు టిక్కెట్లను నవంబర్ 4 నుంచి క్రీడాభిమానులు కొనుగోలు చేయొచ్చని మంగళవారం సాయంత్రం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
అత్యధిక టికెట్ ధర రూ. 2,000 కాగా రూ. 100 తక్కువ టికెట్ ధరగా ఉంది. టెస్టు మ్యాచ్‌ను వీక్షించాలనుకునే క్రీడాభిమానులు www.bookmyshow.com ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చని కేఎస్‌సీఏ తెలిపింది.
ఈ సందర్భంగా కేఎస్‌సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ తరుపున ఆడుతున్న ఏబీ డివిలియర్స్ సొంత మైదానం చిన్నసామిలో ఏబీ డివిలియర్స్ తన 100 టెస్టు మ్యాచ్‌ను ఆడనున్నాడని తెలిపారు.
నిజంగా బెంగుళూరు అభిమానులకు ఇదొక అధ్బుతమైన అవకాశమన్నారు. ఆన్‌లైన్ టికెట్ల విక్రయంతో పాటు బాక్సాఫీసు టిక్కెట్లను చిన్నసామి స్టేడియం వద్ద కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. బాక్సాఫీసు టిక్కెట్లను నవంబర్ 7 ఉదయం 8 గంటల నుంచి అభిమానులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

కాగా, పెద్ద మొత్తంలో టిక్కెట్లను కోనుగోలు చేయాలనుకునే అభిమానులు చిన్నసామి స్టేడియంలో ఉన్న కేఎస్‌సీఏ ఆఫీసు (No. 15, Rest House Crescent Road, Bangalore 560001) వద్ద సంప్రదించాల్సిందిగా సూచించారు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. నవంబర్ 5 నుంచి తొలి టెస్టు మొహాలిలో జరగనుంది. ఈ సిరిస్‌కు గాంధీ-మండేలా సిరిస్ అని నామకరణం చేశారు. ఫ్రీడం ట్రోపీ కోసం రెండు జట్లు తలపడనున్నాయి.
Match starts at 9.30 AM on all days.
(Read as Stand Name, Price)
P 2 - Rs 2,000 (including food)
P-Corporate - Rs 1,250 (including food)
P 1 - Rs 750 P Terrace - Rs 500
P 4 - Rs 750 P 3 - Rs 400
E Executive - Rs 300
D Corporate - Rs 200
A-upper - Rs 150
B-upper - Rs 150
B-lower - Rs 150
N stand - Rs 300
C-lower - Rs 75
C-upper - Rs 150
G-upper - Rs 150
G-lower - Rs 50
M-3 - Rs 150
M-4 - Rs 100
The sale of tickets for the 2nd Test match between India and South Africa has begun today (November 4). The Test will be played at Bengaluru's M Chinnaswamy Stadium from November 14 to 18 (Saturday to Wednesday).