
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పురుషుల వుషు సందా 60 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన సూర్య భాను ప్రతాప్ సింగ్ కాంస్య పతకం సాధించాడు.
సెమీపైనల్ బౌట్‌లో ఇరాన్‌కు చెందిన అహజరియన్ ఎర్ఫాన్ చేతిలో 2-0తో ఓడినప్పటికీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాజా పతకంలో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 7కాంస్యాలు ఉన్నాయి.
వుషు విభాగంలో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం.