Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింటర్ ఒలింపిక్స్‌కు ఓటమితో వీడ్కోలు పలికిన శివ కేశవన్‌

India's Shiva Keshavan finishes 34th in men's singles luge event at sixth and last Olympics

హైదరాబాద్: ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్‌ శివకేశవన్‌ ఓటమితో లూజ్ క్రీడకు వీడ్కోలు పలికాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఇదే తన చివరి టోర్నీ అని ప్రకటించిన శివ కేశవన్ పతకం సాధించడంలో విఫలమయ్యాడు.

టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ లూజ్‌ చాంపియన్‌షిప్‌లో కేశవన్‌ 34వ స్థానంలో నిలిచాడు. ఆదివారం మూడో హీట్‌లో ఒలింపిక్‌ స్లైడింగ్‌ సెంటర్లో అతడు 48.900 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేసి, 30వ స్థానం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లు కలిపితే 34వ స్థానంలో నిలిచాడు.

టాప్‌-20లో లేకపోవడంతో నాలుగో రౌండ్‌కు అతడు అర్హత సాధించలేకపోయాడు. దీంతో తన కెరీర్‌లో ఒక్క పతకం కూడా సాధించకుండానే అతడు నిష్క్రమించాడు. దీంతో రెండు దశాబ్దాల అతడికి కెరీర్‌కు తెరపడింది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ గ్లీచర్‌ స్వర్ణం గెలుచుకున్నాడు.

అమెరికాకు చెందిన క్రిస్‌ మజర్‌ రజతం నెగ్గగా.. జర్మనీకి చెందిన జొహానెస్‌ లుడ్విగ్‌ కాంస్యం గెలుపొందారు. మనాలిలో పుట్టి పెరిగిన శివ కేశవన్‌ పదహారేళ్ల వయసులో తొలిసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 2006లో 25వ స్థానంలో నిలవడమే వింటర్ ఒలింపిక్స్‌లో అతడికి అత్యుత్తమ ప్రదర్శన.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 10:14 [IST]
Other articles published on Feb 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+