
జకార్తా: ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభమైన ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆఖరి రోజైన గురువారం కూడా పతకాలు వస్తూనే ఉన్నాయి. హర్యానాకు చెందిన సీమా పూనియా డిస్కస్ త్రో విభాగంలో 62.26 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకుంది. ఈ పతకం సాధించిన సమయానికి భారత్‌కు 57 మెడల్స్ వచ్చినట్లు అయింది.
అందులో 12 స్వర్ణం, 20 రజతం, 25 కాంస్యాలు ఉన్నాయి. మొత్తం పలురౌండ్లలో సీమా మొదటిసారి 58.51మీటర్లు రెండో సారి ఫౌల్‌గా వెనుదిరిగింది. మూడు నాలుగు సార్లు మంచి ప్రతిభను చూపించడంతో మూడో సారి అత్యధికంగా 62.26 మీటర్లు నాలుగో సారి 61.28 మీటర్లు విసరి మంచి స్కోరు సాధించగలిగింది.
సీమా పూనియా 17 ఏళ్ల నాటికే జూనియర్ కాంపిటీషన్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్నారు. కానీ, తర్వాత డోపింగ్ వివాదం ఆమెను వెంటాడటంతో పోటీలకు కొన్నాళ్ల పాటు దూరం కావాల్సి వచ్చింది.
27 జులై 1983న సోనీపత్ జిల్లాలో పుట్టిన సీమా డిస్కస్ త్రోలో మంచి నైపుణ్యం సంపాదించింది. సీమా పూనియా 2004 నుంచి 2012 సంవత్సరాలలో ఒలింపిక్స్ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు.