
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఏడోరోజైన శనివారం పురుషుల షాట్‌పుట్‌లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. దీంతో భారత్ ఖాతాలో 29వ పతకం చేరగా.. ఇందులో 7 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 17 కాంస్య పతకాలు ఉన్నాయి. ఐదో ప్రయత్నంలో అతడు ఈ ఘనత సాధించాడు.
ఆర్చరీ (ఉ. 9.30 నుంచి): పురుషుల టీమ్ కాంపాండ్ (1/8 ఎలిమినేషన్)- భారత్ vs ఖతార్, మహిళల టీమ్ కాంపౌండ్ విభాగం క్వార్టర్స్- భారత్ vs చైనీస్ తైపీ.
అథ్లెటిక్స్ (ఉ. 9 గం నుంచి ): మహిళల 400 మీ. హర్డిల్స్ హీట్స్- అను రాఘవన్, జుయానా ముర్ము; పురుషుల 400 మీ. హర్డిల్స్- సంతోష్ కుమార్, అయ్యసామి ధారుణ్; మహిళల 100 మీ. సెమీఫైనల్- ద్యూతీ చంద్; పురుషుల లాంగ్ జంప్ ఫైనల్- శ్రీ శంకర్; మహిళల 400 మీ. ఫైనల్- హిమాదాస్, నిర్మల షెరాన్; పురుషుల 10వేల మీటర్ల ఫైనల్- లక్ష్మణ్ గోవింద్.
బ్యాడ్మింటన్ (ఉ. 11 నుంచి): మహిళల సింగిల్స్ క్వార్టర్స్ - సైనా నెహ్వాల్ vs రచనోక్ ఇంటానన్ (థాయ్‌లాండ్), పీవీ సింధు vs జిందాపోల్ (థాయ్‌లాండ్);
బాక్సింగ్ ప్రీక్వార్టర్స్ (మ. 2 నుంచి): 60 కిలోలు- శివ థాపా vs జున్ షాన్; 69 కిలోలు- మనోజ్ కుమార్ vs అబ్దుర్ రహమాన్; మహిళల ప్రీక్వార్టర్స్ 51 కిలోలు- సర్జుబాలా vs మదీనా గఫ్రోవా.
బ్రిడ్జ్ (ఉ. 8 నుంచి): సెమీఫైనల్- పురుషుల టీమ్, మిక్స్‌డ్ ఈవెంట్లు.
కనోయి/కయాక్ (ఉ. 8.30 నుంచి): మహిళల, పురుషుల స్ర్పింట్ 500 మీ. హీట్స్.
ఈక్వెస్ట్రియన్ (ఉ. 11.30 నుంచి): వ్యక్తిగత ఈవెంట్ జంపింగ్ ఫైనల్- ఆశిష్ మాలిక్, రాకేష్ కుమార్, జితేందర్ సింగ్, ఫవాద్ మీర్జా.
హ్యాండ్‌బాల్ (ఉ. 9.30 నుంచి): భారత్ - చైనీస్ తైపీ.
హాకీ (సా. 4.30 గం): పురుషుల గ్రూప్-ఎ- భారత్-కొరియా.
షూటింగ్ (ఉ. 7 నుంచి): రష్మీ రాథోడ్, గనేమత్ షెకాన్, అంగద్ వీర్ సింగ్, షీరజ్ షేక్.
టేబుల్ టెన్నిస్ (ఉ. 8 నుంచి): మహిళల టీమ్ ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్-ఎలో ఖతార్, చైనా, ఇరాన్‌తో భారత మ్యాచ్‌లు, గ్రూప్-డిలో యూఏఈ, చైనీస్ తైపీతో భారత పురుషుల మ్యాచ్‌లు.
వాలీబాల్ (ఉ. 11 గం): పురుషుల క్లాసిఫికేషన్ రౌండ్‌లో భారత్ ్ఠ జపాన్.