
జకార్తా: నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని దక్కించుకోవడంతో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 15కు చేరింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. విభాగాల వారీగా పతకాలు షూటింగ్‌లో 7, వుషూలో 4, రెజ్లింగ్‌లో 3, సెపక్‌తక్రాలో 1 లుగా ఉన్నాయి.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్: బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి నాయక్ (మ.గం.3 నుంచి).
బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్: సింధు(vs)వు తి ట్రాంగ్ (వియత్నాం); సైనా (vs) సొరయ (ఇరాన్). మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, అశ్విని (vs) ఎన్గా తింగ్ యుంగ్, వింగ్ యుంగ్ (హాంకాంగ్).
మిక్స్‌డ్ డబుల్స్: సిక్కి రెడ్డి, ప్రణవ్ (vs)లూ యింగ్ గో, పెంగ్ సూన్ చాన్ (మలేసియా); అశ్విని, సాత్విక్(vs)సప్సిరి, డెచాపొల్ (థాయ్‌లాండ్) (ఉ.గం.10.30 నుంచి).
షూటింగ్ : మహిళల డబుల్ ట్రాప్ ఫైనల్స్: వర్ష వర్మన్, శ్రేయసి సింగ్ (ఉ.గం.9.15 నుంచి).
వెయిట్‌లిఫ్టింగ్: సతీశ్ శివలింగం (77 కేజీలు- ఉ.గం. 9.30 నుంచి).
టెన్నిస్: మహిళల సింగిల్స్ సెమీస్: అంకిత(vs)షువాయి జంగ్ (చైనా) (ఉ. 8.30 గంటల నుంచి).
వాలీవాల్: మహిళలు: భారత్ఠ్‌కజకిస్థాన్ (ఉ. 8.30 నుంచి)
బాస్కెట్ బాల్: మహిళలు: భారత్ఠ్‌ఇండోనేసియా (సా. 4.30 నుంచి)