
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ బుధవారం నాటికి నాలుగో రోజుకి చేరుకున్నాయి. మంగళవారం వరకు భారత ఖాతాలో మొత్తం 10 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 3 స్వర్ణం, 3 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
మొత్తం 10 పతకాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా గేమ్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బుధవారం మరికొన్ని ఈవెంట్లలో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశం ఉంది.
ఆసియా గేమ్స్‌లో ఈరోజు:
జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ (సా.గం.5 నుంచి)
పురుషుల హాకీ: భారత్(vs)హాంకాంగ్ (మ.గం. 12.30 నుంచి)
షూటింగ్: మహిళలు: అంజుమ్, గాయత్రి (50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి) మను భాకర్, రాహీ సర్నోబాత్ (25 మీ. పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి)
పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్: గుర్‌ప్రీత్ సింగ్ (77 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (87 కేజీలు), హర్‌దీప్ (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) (మధ్యాహ్నం గం. 12 నుంచి).
సోనీ టెన్-2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం