Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్‌2018 లో నేటి భారత షెడ్యూల్

Indias schedule at 2018 Asian Games on Day 10

హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ మంగళవారం నాటికి పదో రోజుకి చేరుకున్నాయి. మంగళవారం వరకు భారత ఖాతాలో మొత్తం 41 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 8 స్వర్ణం, 13 రజతం, 20 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

మొత్తం 41 పతకాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఆసియా గేమ్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మంగళవారం మరికొన్ని ఈవెంట్లలో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశం ఉంది.

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్:

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ (సింధు,తైజుయింగ్‌; ఉ. గం.11.30 నుంచి)

ఆర్చరీ: మహిళల, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్స్‌ (భారత్‌గీకొరియా;ఉ.10.30 నుంచి)

అథ్లెటిక్స్‌: మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్‌ (అన్ను రాణి; సా.5.55 నుంచి); పురుషుల 800 మీ. ఫైనల్‌: జిన్సన్‌ జాన్సన్, మన్‌జిత్‌ సింగ్‌ (సా.6.10 నుంచి); మహిళల 5 వేల మీ. ఫైనల్‌ (సూరియా, సంజీవని; సా. గం.6.20 నుంచి).

బాక్సింగ్‌: మహిళల 57 కేజీల క్వార్టర్‌ ఫైనల్స్‌ (సోనియా గీ జొ సన్‌ హా); మ. గం.1 నుంచి; మహిళల 60 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌: పవిత్ర గీ హుస్వాతున్‌); మం.గం.1.45 నుంచి

హాకీ: పురుషుల పూల్‌ లీగ్‌ మ్యాచ్, భారత్‌ గీ శ్రీలంక; మ. గం.2.30 నుంచి.

సోనీ టెన్‌-2, టెన్‌-3, సోనీ ఈఎస్‌పీఎన్‌ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Tuesday, August 28, 2018, 9:03 [IST]
Other articles published on Aug 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+