Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌‌గా ఇర్ఫాన్‌

 Indias Irfan KT qualifies for 2020 Tokyo Olympics

హైదరాబాద్: వచ్చే ఏడాది జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రేస్‌ వాకర్‌ కేటీ ఇర్ఫాన్ నిలిచాడు. ఆదివారం జపాన్‌లోని నోమిలో జరిగిన ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇర్ఫాన్ 20 కిలోమీటర్ల నడక విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు.

20 కిలోమీటర్ల దూరాన్ని ఇర్ఫాన్ గంటా 20 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (గంటా 21 నిమిషాలు) అందుకున్నాడు. దీంతో పాటు సెప్టెంబర్‌-అక్టోబర్‌లో దోహా వేదికగా జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్(అర్హత ప్రమాణం: గంటా 22 నిమిషాల 30 సెకన్లు) కూడా ఇర్ఫాన్ అర్హత సాధించాడు.

ఈ ఏడాది జనవరి నుంచి 2020, మార్చి 31 వరకు రేస్‌ వాక్‌, మారథాన్‌లలో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్ల పీరియడ్‌ కొనసాగనుంది. కేరళకు చెందిన 29 ఏళ్ల ఇర్ఫాన్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పదో స్థానాన్ని పొందాడు. మరోవైపు భారత్‌కు చెందిన మరో ఇద్దరు వాకర్లు దేవిందర్‌ సింగ్‌ (గంటా 21ని.22 సెకన్లు), గణపతి కృష్ణన్ (గంటా 22ని.12 సెకన్లు) కూడా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.

Story first published: Monday, March 18, 2019, 13:18 [IST]
Other articles published on Mar 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+