షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

హైదరాబాద్: జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ చరిత్ర సృష్టించింది. అర్హత రౌండ్‌లో భాగంగా జరిగిన గేమ్‌లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఎలావెనిల్ 249.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
కీలకమైన 24వ షాట్‌లో ఆమె 10.7 పాయింట్లు రాబట్టడంతో విజయం సొంతమైంది. కెరీర్‌లో రెండో ప్రపంచకప్ ఆడుతున్న ఈ 18 ఏండ్ల ఎలావెనిల్‌కు ఇది తొలి ఫైనల్. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత అమ్మాయి 631.4 పాయింట్లతో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
టీమ్ ఈవెంట్‌లోనూ ఎలావెనిల్, శ్రేయా అగర్వాల్, జీనా కిట్టా పసిడిని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగత స్వర్ణంతోపాటు శ్రేయ అగర్వాల్, జీనా ఖిట్టాలతో కలిసి టీమ్ స్వర్ణం గెలిచింది. 18 ఏళ్ల ఎలావెనిల్ ఫైనల్లో 249.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, చైనీస్ తైపీకి చెందిన షిన్ రజతం, చైనాకు చెందిన వాంగ్ కాంస్యం నెగ్గారు.
ఎలావెనిల్.. స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications