Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ. 50 లక్షల బీమాతో కామన్వెల్త్‌ గేమ్స్‌కు అథ్లెట్లు (ఫోటోలు)

India's CWG-bound athletes to get Rs 50 lakh insurance cover

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో వేదికగా ఏప్రిల్లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే 227 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.50 లక్షల మేరకు బీమా వర్తించనుంది. ఈ మేరకు ఎడల్‌వీస్‌ టోక్యో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తెలిపింది.

India To Field 227 Member Contingent At Gold Coast Games

ఈ ఒప్పందం కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఆసియా గేమ్స్, టోక్యో ఒలింపిక్స్(2020)కు కూడా వర్తించనుంది. 2018, 2019 జాతీయ క్రీడలనుకూడా ఆ సంస్థే స్పాన్సర్‌ చేస్తోంది. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ నుంచి 227మంది అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

రేమండ్ సంస్ధతో ప్రత్యేకంగా బ్లేజర్లు

రేమండ్ సంస్ధతో ప్రత్యేకంగా బ్లేజర్లు

ఇక, కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ మార్చ్‌ ఫాస్ట్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం రేమండ్ సంస్థతో ప్రత్యేకంగా బ్లేజర్లు డిజైన్ చేయించారు. దీంతో అథ్లెట్ల అధికారిక జెర్సీని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌లో క్రీడలకు అది పెద్ద స్పాన్సర్‌గా ప్రభుత్వమే వ్యవహరిస్తోంది. గత కామన్‌వెల్త్‌ క్రీడల కంటే ఈ సారి ఎక్కువ పతకాలు గెలవాలి. ఆటగాళ్లతో పాటు అధికారులకు సొంత క్రమశిక్షణ ఉండాలి. దేశాన్ని గర్వపడేలా చేయాలి' అని అన్నారు.

భారత్‌ను క్రీడా పరికరాల తయారీ హబ్‌గా

భారత్‌ను క్రీడా పరికరాల తయారీ హబ్‌గా

అంతేకాదు భారత్‌ను క్రీడా పరికరాల తయారీ హబ్‌గా చేయడం తన ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ తెలిపారు. ‘భారత్‌లో అత్యుత్తమ క్రీడాపరికరాలను తయారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ రంగంలో ప్రయివేట్‌ సంస్థలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం, ఖేలో ఇండియా పథకాలపైనే మేము ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం' అని అన్నారు.

ఐఓఏ నడవాలంటే ప్రభుత్వ నిధులు కావాల్సిందే

ఐఓఏ నడవాలంటే ప్రభుత్వ నిధులు కావాల్సిందే

మరోవైపు సొంత ఖర్చులతో అథ్లెట్లను కామన్‌వెల్త్‌ క్రీడలకు పంపే పరిస్థితుల్లో లేదని, ఐఓఏ నడవాలంటే ప్రభుత్వ నిధులు కావాల్సిందేనని అధ్యక్షుడు నరేందర్‌ బత్రా స్పష్టం చేశాడు. 'ఆర్థికంగా బలంగా ఉండడం మంచిదే. కానీ భారత్‌లో క్రికెట్‌ మినహా ఏ క్రీడా సంఘమైనా ప్రభుత్వం నుంచి నిధులు అందితేనే ముందుకు సాగుతుంది. అందుకే క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నిధులు పొందే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం' అని నరేందర్‌ బత్రా తెలిపాడు.

కామన్వెల్త్ గేమ్స్‌కు దీపా కర్మార్కర్ దూరం

కామన్వెల్త్ గేమ్స్‌కు దీపా కర్మార్కర్ దూరం

ఈ కార్యక్రమానికి దీపా కర్మాకర్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, జీతూ రాయ్‌, మను భాస్కర్‌, అనురాజ్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌ సింగ్‌, రాణి రాంపాల్‌ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ మోకాలి గాయం కారణంగా కామన్వెల్త్‌ గేమ్స్‌కు దూరం కానుంది. గతేడాది ఏప్రిల్‌లో దీప మోకాలికి ఆపరేషన్ జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది.

Story first published: Tuesday, February 27, 2018, 11:40 [IST]
Other articles published on Feb 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+