న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: భారత కబడ్డీ జట్టు ప్రకటన, కెప్టెన్‌గా అజయ్‌ ఠాకూరే

By Nageshwara Rao
Indias 12-member squad for Asian Games 2018 announced

హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆరంభం కానున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్) ప్రకటించింది. తమిళ్‌ తలైవాస్‌ కెప్టెన్ అజయ్‌ ఠాకూరే మరోసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

సీనియర్ ఆటగాళ్లను పూర్తిగా పక్కకు పెట్టిన సమాఖ్య యువ ఆటగాళ్లతో కూడిన జట్టుని ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు రాకేశ్‌ కుమార్‌, అనూప్‌ కుమార్‌, మంజీత్‌ చిల్లర్‌, సురేంద్ర నాడాలకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇటీవలే టీమిండియా కబడ్డీ జట్టు దుబాయ్‌ మాస్టర్స్‌ కబడ్డీ టోర్నీని గెలుచుకుంది.

ఆసియా గేమ్స్‌లో ఏడు సార్లు స్వర్ణం నెగ్గిన భారత కబడ్డీ జట్టు ఆగస్టులోఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ప్రదీప్‌ నర్వాల్‌, రాహుల్‌ చౌదరి, అజయ్‌ ఠాకూర్‌, రిషాంక్‌ దేవడిగ, రోహిత్‌ కుమార్‌, మోనూ గోయత్‌లతో రైడింగ్‌ విభాగం బలంగా ఉంది.

మరోవైపు దీపక్‌ నివాస్‌ హుడా, సందీప్‌ నర్వాల్‌, గిరీష్‌ మారుతి ఎర్నాక్‌, మోహిత్‌ చిల్లర్‌, రాజు లాల్‌ చౌదరీ, మల్లేష్‌ గంగాధరిలతో ఢిఫెండింగ్‌ కూడా పటిష్టంగా ఉంది.

ఆసియా గేమ్స్‌కు భారత కబడ్డీ జట్టు:
Ajay Thakur (Tamil Thalaivas)
Pardeep Narwal (Patna Pirates)
Rishank Devadiga (UP Yoddha)
Monu Goyat (Haryana Steelers)
Rohit Kumar (Bengaluru Bulls)
Rahul Chaudhari (Telugu Titans)
Deepak Niwas Hooda (Jaipur Pink Panthers)
Sandeep Narwal (Puneri Paltan)
Girish Maruti Ernak (Puneri Paltan)
Mohit Chhillar (Jaipur Pink Panthers)
Raju Lal Choudhary (Bengaluru Bulls)
Mallesh Gangadhari (Jaipur Pink Panthers)

Stand by:
Maninder Singh (Bengal Warriors)
Amit Nagar (Bengal Warriors)

Story first published: Thursday, July 12, 2018, 12:17 [IST]
Other articles published on Jul 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X