Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్ లో ధనాధన్, ఇండియా నెంబర్ వన్

India
కోల్‌కత్తా: హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో మోర్కెల్‌ ఎల్బీడబ్యూగా వెనుతిరగడం, దక్షిణాఫ్రికా ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముంగిట విజయం వాలింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌ ప్రపంచాధిపత్యం పదిలమయింది. సీరిస్‌ను 1-1తో భారత్‌ సమం చేసింది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో పరాభవం పొందిన టీమిండియా దానికి ప్రతీకారం తీర్చుకుంది. సఫారిలపై ఇన్నింగ్స్‌ 58 పరుగులతో ఘనవిజయం సాధించి, వరల్డ్‌ నెంబర్‌గా ఇండియా సగర్వంగా నిలిచింది.

అచ్చొచ్చిన ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో భారత్‌ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. టెస్టుల్లో నెంబర్‌ కీరిటం కోసమేన్నట్లు హోరాహరీగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచి సఫారిలను మట్టికరిపించింది. గురువారం చివరిరోజు స్పిన్నర్ల హవా కొనసాగడంతో దక్షిణాఫ్రికా 289 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్లను ఎదుర్కొని హషిం ఆమ్లా ఒంటరి పోరాటం చేశాడు. అజేయంగా సెంచరీ(127) చేసి ఆకట్టుకున్నాడు. అయితే స్పిన్నర్లు చెలరేగడంతో ఇతర బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరోసారి అద్భుత ప్రదర్శన ఇచ్చిన హర్భజన్‌సింగ్‌ ఐదు వికెట్లు తీసుకున్నాడు. కెరిర్‌లో మరోసారి చిరస్మరణీయ గణాంకాలు(5-58) నమోదుచేశాడు. మరోవైపు అమిత్‌ మిశ్రా కూడా చక్కని సహకారం అందించాడు. మూడు వికెట్లు తీసుకొని సఫారిల పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇశాంత్‌ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+