For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా ఫాస్టెస్ట్ టీంగా భారత్ రికార్డు.. తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం!

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు అదరగొట్టింది. అత్యంత వేగంగా ఈ రేస్‌ను ముగించిన ఆసియా దేశంగా రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన హీట్స్-1లో భారత పురుషులు చెలరేగారు. మహమ్మద్ అనాజ్, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్ నలుగురూ ఉన్న బృందం అద్భుతంగా రాణించింది. ఈ టీం కేవలం 2.59.05 సెకన్లలోనే రేస్‌ను ముగించింది.

ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత రిలే బృందం ఇలా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, 4×400 మీటర్ల రిలేను అత్యంత వేగంగా ముగించిన ఆసియా జట్టుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు జపాన్ బృందం పేరిట ఉండేది. జపాన్ టీం 2.59.51 సెకన్లలో ఈ రేస్ ముగించింది. ఇప్పుడు భారత బృందం ఈ రికార్డు బద్దలు కొట్టింది.

Indian 4s400 mens relay team creates history. They reach final for the first time

ఇక ఈ రేస్‌లో అమెరికా బృందం టాప్‌లో నిలిచింది. భారత్ రెండో స్థానం సాధించింది. మూడో స్థానంలో బ్రిటన్ బృందం నిలిచింది. అమెరికా ఈ రేస్‌ను 2.58.47 సెకన్లలో పూర్తి చేయడం గమనార్హం. ఇక బ్రిటన్ బృందం ఈ రేస్‌ను 2.59.42 సెకన్లలో పూర్తి చేసింది. ఈ మూడు టీమ్స్‌తో పాటు బోత్సువానా, జమైకా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ కూడా ఆదివారం ఫైనల్‌‌కు అర్హత సాధించాయి.

ఈ రేస్‌లో ఫైనల్‌కు జపాన్, జర్మనీ, బెల్జియం, శ్రీలంక, హంగేరి వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి. మొత్తం 17 దేశాలు ఈ పోటీలో పాల్గొనగా.. కేవలం 8 టీమ్స్ మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించడం గమనార్హం. వీటిలో భారత్ రెండో స్థానం సాధించి, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. ఫైనల్‌లో కూడా భారత బృందం ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Sunday, August 27, 2023, 13:06 [IST]
Other articles published on Aug 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+