భారతదేశ ఒలింపిక్ ప్రయాణం ఇప్పుడు చాలా సాఫీగా సాగుతోంది. ఇందుకు కారణం స్పాన్సర్‌షిప్‌లు. స్పాన్సరర్లు ఉండటంచేత గణనీయమైన వృద్ధిని సాధించింది. క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందివ్వడం,వారి ప్రదర్శన మరింత మెరుగు కావడంలో స్పాన్సరర్స్ పాత్ర కీలకంగా మారింది. క్రీడాకారుల శిక్షణకు, వారికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అదే సమయంలో వారు అంతర్జాతీయస్థాయిలో పాపులర్ కావడానికి స్పాన్సరర్లు వారిపై పెట్టే పెట్టుబడి అధికంగానే ఉంటుంది.
రిలయన్స్, టాటా మరియు JSW వంటి కార్పొరేట్ దిగ్గజాలు క్రీడాకారులకు అండగా ఉండి ప్రోత్సహించడంలో ముందంజలో ఉన్నాయి. వారి సహకారంతో అథ్లెట్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలు పొందడమే కాకుండా మంచి కోచింగ్‌లను పొందేలా చేసింది. అంతర్జాతీయ వేదికపై పోటీ చేయడానికి ఈ మద్దతు చాలా అవసరం.

ఇటీవలి సంవత్సరాలలో, భారత ప్రభుత్వం కూడా క్రీడలపై ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచింది. పతక విజేతలను ముందుగానే గుర్తించి వారిని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా క్రీడాకారులకు శిక్షణ మరియు పోటీ ఖర్చుల కోసం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. స్పాన్సర్‌షిప్‌లు కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే పరిమితం కాలేదు.అథ్లెట్ వ్యక్తిగత కెరీర్‌లో కూడా నిలదొక్కుకునేందుకు అండగా నిలుస్తాయి. అథ్లెట్లను ఎండోర్స్ చేసే బాధ్యతను కూడా స్పాన్సరర్స్ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల క్రీడాకారులకు మరింత నిధులు మరియు అవకాశాలు వచ్చేలా చేస్తాయి.
ఇటీవలి ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శనలో ఈ స్పాన్సర్‌షిప్‌ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో దేశం ఏడు పతకాలను గెలుచుకుంది. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉంది. ఈ విజయం కార్పొరేట్ స్పాన్సర్‌లు మరియు ప్రభుత్వం నుండి క్రీడాకారులకు లభించిన నిరంతర మద్దతును తెలియజేస్తుంది.
భవిష్యత్తు ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని విజయాలను సాధించడంలో స్పాన్సర్‌షిప్ పాత్ర చాలా ముఖ్యమైనదని గమనించాల్సి ఉంటుంది. ఈ ఉన్నత పథాన్ని కొనసాగించడానికి మౌలిక సదుపాయాలు, శిక్షణ మరియు అథ్లెట్ల అభివృద్ధిలో నిరంతర పెట్టుబడి అవసరం.
భారతదేశ ఒలింపిక్ విజయావకాశాలను నెరవేర్చడంలో స్పాన్సర్‌షిప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. కార్పొరేట్ స్పాన్సర్‌లు మరియు ప్రభుత్వ కార్యక్రమాల సంయుక్త ప్రయత్నాలు క్రీడాకారుల్లో ప్రతిభను పెంపొందించడానికి మరియు ప్రపంచ వేదికపై క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి.