Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్టూ ఉత్కంఠ: భారత్ విజయ లక్ష్యం 207 పరుగులు

India vs Australia
బెంగళూర్: ఉత్కంఠగా సాగిన మొదటి టెస్టు గురించి మరిచిపోక ముందే ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా మారింది. మ్యాచ్ చివరి రోజు బుధవారం ఉదయం ఆస్ట్రేలియా వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలవుట్ అయింది. భారత్ విజయానికి 207 పరుగులు చేయాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉన్న భారత్ ఈ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుందా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పిచ్ కూడా బ్యాటింగ్ కు ప్రతికూలంగా మారిన స్థితిలో విజయం భారత్ కు అంత సులభమేమీ కాదు.

మంగళవారం ఆట ముగిసే సమయానికి 202 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా బుధవారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించింది. మిగతా మూడు వికెట్లను ఆస్ట్రేలియా బుధవారం త్వరగా కోల్పోయింది. శ్రీశాంత్, జహీర్ ఖాన్ ఈ మూడు వికెట్లను తీసుకున్నారు. రెండో ఇన్నింగ్సులో భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్, ఓజా లకు మూడేసి వికెట్లు రాగా, శ్రీశాంత్, హర్భజన్ లకు రెండేసి వికెట్లు వచ్చాయి. రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+