Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత మీడియాపై ఇంతికాబ్ గుర్రు

Pakistan coach Intikhab
కరాచీ: అత్త మీది కోపం దుత్త మీద చూపినట్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ ఇంతికాబ్ ఆలం భారత మీడియాపై విరుచుపడ్డాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ముందుకు రావడానికి భారత మీడియానే కారణమని ఆయన విరుచుకుపడ్డారు. తమ పరువును తీస్తున్న భారత్ తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకునే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆలోచించాలని ఆయన అన్నారు. తప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కథనాలు రాస్తున్నందుకు భారత మీడియా సిగ్గుపడాలని, తాము ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు భారత మీడియా సృష్టించిన కథనాల్లో నిజం లేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు భారత మీడియా రాసిన కథనాల వల్లనే ముందుకు వచ్చాయని, తమ ప్రతిష్టను దెబ్బ తీయడానికి భారత మీడియా నిరంతరంగా పనిచేస్తోందని ఆయన విమర్శించారు. తమను నాశనం చేయడానికి పూనుకున్న భారత్ తో తాము క్రికెట్ ఆడే విషయంపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. భారత మీడియా కథనాల ఆధారంగా జంషెడ్ దస్తీ వంటి పార్లమెంటు సభ్యులు నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీలో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని లేవనెత్తడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు. రెండు ప్రధాన టోర్నమెంటుల్లో భారత్ ఓటమి పాలు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+