Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

హైదరాబాద్: భారత బాక్సింగ్‌లో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. 2021లో నిర్వహించనున్న పురుషుల వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు భారత్ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య(ఏఐబీఏ) ప్రకటించింది.

ఈ పోటీలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై రెండు రోజులుగా మాస్కోలో ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది. ఈ చర్చల అనంతరం భారత్‌లో నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కి ఇదే తొలిసారి.

 India to host maiden men's World Boxing Championship in 2021

2019లో సోచిలో పురుషుల ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్‌ కుయో వు తెలిపారు. ఆ తర్వాత 2021లో పురుషుల ఛాంపియన్‌షిప్‌ కూడా భారత్‌లోనే జరగనుంది. ఇక 2018లో మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.


మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2006లో భారత్‌ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఆగస్టులో హాంబర్గ్‌లో జరగబోయే పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చింగ్‌ కుయో తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+