హైదరాబాద్: 2019లో జరిగే (కామన్వెల్త్ యూత్, జూనియర్, సీనియర్) వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో సమావేశమైన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ సందర్భంగా 2019 ఛాంపియనషిప్‌ల నిర్వహణను భారత్‌కు అప్పగిస్తున్నట్టు సమాఖ్య తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గోల్డ్‌కోస్ట్‌లోనే జరుగుతుండటం విశేషం. కాగా, భారత లిఫ్టర్లు మీరాభాయ్ చాను, కే సంజిత చాను వారి వారి విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన సంగతి తెలిసిందే.
తద్వారా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్త్ క్రీడలకు వీరు అర్హత సాధించారు.