2020 ఒలింపిక్స్‌లో భారత్‌కు బోలెడు స్వర్ణాలు: బింద్రా

హైదరాబాద్: బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షూటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని తెచ్చిపెట్టిన అభినవ్ బింద్రా ఈ విధంగా అన్నారు. 2020 ఒలింపిక్షలో భారత్‌కు షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని తెచ్చే ఘనత చాలా మందికి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ గొప్పదనాన్ని ఏ ఒక్కరికో ఆపాదించడం సరికాదన్నారు.
బుధవారం మధ్యప్రదేశ్‌లో షూటింగ్ అకాడమీని బింద్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల్లో ఒకరు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను తెచ్చే సత్తా చాలా మందికి ఉందన్నారు.
తాను సభ్యుడిగా ఉన్న 2020 ఒలింపిక్ టాస్క్‌పోర్స్ రెండు నెలల కిందటే క్రీడా మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిందని చెప్పాడు. మధ్యప్రదేశ్‌లోని షూటింగ్ అకాడమీకి కావాల్సిన పరికరాలను అంతర్జాతీయ క్రీడా సమితి (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్) సమకూర్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications