Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగారు కొండకు సాదర స్వాగతం

Abhinav Bindra
న్యూఢిల్లీ: బంగారు కొండ అభినవ్ బింద్రాకు గురువారం ఉదయం ఘనస్వాగతం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్ స్వర్ణపతకం గెలుచుకున్న ఆయన తన మాతృభూమికి తిరిగి వచ్చారు. ఆయన ఎయిర్ చైనా విమానంలో బీజింగ్ నుంచి తిరిగి వచ్చారు. తండ్రి అప్ జిత్ సింగ్ బింద్రా, తల్లి బాబ్లీ బింద్రా, సోదరి దివ్యా కపూర్, బావ అంగద్ కపూర్ అభినవ్ బింద్రాకు స్వాగతం పలికారు.

విజయం ఇప్పుడిప్పుడే జీర్ణం అవుతుందని అభినవ్ బింద్రా ఉద్వేగంగా అన్నారు. తమందరికీ ఇది కలా, నిజమా అన్నట్లుందని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయన తన పతకాన్ని భారీగా తరలి వచ్చిన అభిమానులకు చూపారు. తన విజయం తన కుటుంబానికే చెందుతుందని ఆయన అన్నారు. తాను చాలా ఆనందంగా ఉన్నానని, ఒలింపిక్స్ లో తొలి స్వర్ణపతకం తనకు దక్కడం గర్వంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తాను దేశానికి గౌరవం తెచ్చి పెట్టానని, తాను అంతర్ముఖుడినని, తాను అలసిపోయానని, మూడు రోజులుగా నిద్ర లేదని ఆయన అన్నారు. మీడియాను రేపు కలుస్తానని ఆయన చెప్పారు.
Story first published: Thursday, August 14, 2008, 14:04 [IST]
Other articles published on Aug 14, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+