Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిన్న సచిన్ టెండుల్కర్..నేడు విరాట్ కోహ్లీ..రేపు?

PR Sreejesh: భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు అరుదైన గుర్తింపు లభించింది. పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల హాకీలో భారత్‌కు రజత పతకం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఈ మలయాళీ.. జాయింట్ ఫ్లాగ్‌బేరర్‌గా నిలువబోతోన్నాడు. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ క్లోజింగ్ సెరెమనిలో సందర్భంగా జాతీయ పతకాన్ని రెపరెపలాడించబోతోన్నాడు.

పారిస్ ఒలింపిక్స్ ఈ రాత్రి ముగియబోతోన్నాయి. బ్రిటీష్ సమ్మర్ టైమ్ జోన్ ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు ముగింపు వేడుకలు ఆరంభమౌతాయి. రాత్రి 10:30 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో భారత్ టీమ్‌కు జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు పీఆర్ శ్రీజేష్. మనూ భాకర్‌తో కలిసి జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా నామినేట్ అయ్యారు.

India gas talent to find replacement for me someone will take my place says PR Sreejesh

ఈ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన రిటైర్మెంట్ జీవితంపై మాట్లాడాడు. రిటైర్మెంట్ తరువాత తన లైఫ్ ఎలా ఉండాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. పూర్తి సమాయాన్ని కుటుంబానికి కేటాయిస్తానని, దీనికే ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు.

భవిష్యత్తులో హాకీ జట్టులో తన స్థానాన్ని భర్తీ చేసే టాలెంట్.. దేశంలో పుష్కలంగా ఉందని శ్రీజేష్ చెప్పాడు. ఈ విషయంలో ఎలాంటి వాక్యూమ్ ఉండబోదని తేల్చి చెప్పాడు. తన స్థానంలో మరొకరు ఖచ్చితంగా వస్తారని, ఒకరు రిటైర్మెంట్ తరువాత మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయడం క్రీడల్లో అత్యంత సహజమని అన్నాడు.

నిన్నటి క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఓ లెజెండ్‌గా ఉన్నాడని, ఆయన రిటైర్మెంట్ తరువాత నేడు విరాట్ కోహ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేశాడని శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తరువాత అతని స్థానాన్ని ఎవరో ఒకరు తీసుకుంటారని స్పష్టం చేశాడు. అలాగే శ్రీజేష్ అనే వాడు నిన్న గోల్ కీపర్‌గా ఉన్నాడని, రేపు మరొకరు వచ్చి అతని స్థానంలో ఉంటారని పేర్కొన్నాడు.

హాకీ తప్ప మరేదీ తనకు తెలియదని, రిటైర్మెంట్ అనంతరం ఒక జీవితాన్ని కోల్పోయినట్లు భావిస్తున్నానని శ్రీజేష్ భావోద్వేగంతో చెప్పారు. స్పెయిన్‌పై మ్యాచ్ గెలిచిన సంతోషం.. అది చివరిది కావడం వల్ల దుఖం కలిసి వచ్చాయని వ్యాఖ్యానించాడు. రజత పతకం దక్కకపోవడం కొంత వరకు నిరాశ కలిగించిందని అన్నాడు.

Story first published: Sunday, August 11, 2024, 11:08 [IST]
Other articles published on Aug 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+