Paris Olympics 2024: నేటి భారత క్రీడాంశాలు.. బోణీ కొట్టేనా?
పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.చరిత్రలో నిలిచేలా ఈ వేడుక సాగింది. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై దాదాపు 6800 క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 3 ,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఆ తర్వాత గ్రీస్ బృందం పరేడ్‌లో పాల్గొంది.అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ వచ్చింది.
పరేడ్‌లో భారత క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మన క్రీడాకారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం తమ పోటీలు ఉన్న కొందరు క్రీడాకారులు వేడుకకు దూరంగా ఉన్నారు. కాగా, ఇవాళ భారత షూటర్లు పతక లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. షూటింగ్‌తో పాటు ఇవాళ భారత్ పోటీపడే ఇతర క్రీడాంశాలు ఏంటంటే...

జులై 27న భారత్ షెడ్యూల్
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బాల్‌రాజ్ పన్వర్)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్: 10మీ.ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (వలరివన్-సందీప్, రమిత-అర్జున్)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్: కాంస్య, స్వర్ణ పోరు- మధ్యాహ్నం 2 గంటలకు;
షూటింగ్: 10మీ.ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషులు (అర్జున్, సరబ్‌జోత్)- మధ్యాహ్నం 2 గంటలకు; మహిళలు (మను బాకర్, రిథమ్ సంగ్వాన్)- సాయంత్రం 4 గంటలకు
టెన్నిస్: పురుషుల డబుల్స్ తొలి రౌండ్ (బోపన్న-బాలాజి × ఫాబియన్-రోజర్)- మధ్యాహ్నం 3.30 గంటలకు
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ (లక్ష్యసేన్ × కెవిన్)- రాత్రి 7.10 గంటలకు
బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ (సాత్విక్-చిరాగ్ × లుకాస్-రోనన్)- రాత్రి 8 గంటలకు
బ్యాడ్మింటన్: మహిళల డబుల్స్ (అశ్విని-తనీషా × కిమ్‌సొ-కాంగ్)- రాత్రి 11.50 గంటలకు
హాకీ: భారత్ × న్యూజిలాండ్- రాత్రి 9 గంటలకు
టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్ (హర్మీత్ దేశాయ్ × యమన్)- రాత్రి 7.15 గంటలకు
బాక్సింగ్: మహిళల 54 కేజీలు తొలి రౌండ్ (ప్రీతి× తి కిమ్)- రాత్రి 12.05 గంటలకు
కాగా, ఈ పోటీలు జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications