Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్ ప్రపంచకప్‌.. 5 స్వర్ణాలతో సత్తాచాటిన భారత్

India finish ISSF Rio World Cup with 5 gold medals

రియో డిజెనరో: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ మొత్తం ఐదు స్వర్ణాలను సొంతం చేసుకుని తన సత్తా చాటింది. బ్రెజిల్‌లోని రియో డిజెనరోలో జరిగిన ఈ టోర్నీలో భారత్ 5 స్వర్ణాలు, రెండు రజితం, 2 కాంస్యం పతకాలు సొంతం చేసుకుంది. దీంతో భారత్ టోర్నీని ఘనంగా ముగించింది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో భారత జోడి అపూర్వ చండేలా-దిపక్‌కుమార్ చైనాకు చెందిన కియాన్ యాంగ్-హొనాన్‌ యూ జోడిని ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. 11 సింగిల్ షాట్ డ్యూయెల్స్‌లో ఎనిమిదింటిని భారత్ గెలుచుకుంది. భారత్ 419.1 పాయింట్లతో స్వర్ణ పతకం గెలుచుకుంది. 418.7తో చైనా రెండవ స్థానంలో నిలిచింది.

10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మనుబాకర్- సౌరభ్ చౌదరీ జోడీ భారత్‌కే చెందిన యశస్వినీ దేశ్‌వాయ్ - అభిషేక్ వర్మ జోడీని ఓడించి స్వర్ణం గెలుచుకున్నారు. దీంతో యశస్వినీ దేశ్‌వాయ్ - అభిషేక్ వర్మ జోడీకి రజితం లభించింది. భారత్‌కు చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్-దివ్యాన్ష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సొంతం చేసుకుంది.

Story first published: Tuesday, September 3, 2019, 9:40 [IST]
Other articles published on Sep 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+