Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా కొక న్యాయం, ఇంగ్లాండ్ కొక న్యాయమా?

Metropolitan Police
ముందో పోలీస్ ఎస్కార్ట్ వాహనం... వెనక మరో రెండు పోలీస్ కార్లు... ఆ వెనకే రెండు బైక్‌లపై పోలీసులు... మధ్యలో భారత జట్టు బస్... చరిత్రలో ఇప్పటివరకూ ఇంగ్లండ్‌లో ఏ క్రికెట్ జట్టు కూడా ఇంత భద్రత నడుమ మైదానానికి రాలేదు. సోమవారం సాయంత్రం ఏడు గంటలు సమయంలో బర్మింగ్‌హామ్‌లోని సిటీ సెంటర్‌లో దాడులు ప్రారంభమయ్యాయి. కొందరు దుండగులు ముసుగులు ధరించి కనిపించిన షాపులను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో భారత క్రికెటర్లలో కొందరు షాపింగ్ చేస్తున్నారు. ప్రవీణ్, ఓజా, కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్లతో కలిసి సిటీ సెంటర్ సమీపంలోని విక్టోరియా సెంటర్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఫ్యాన్స్‌తో మాట్లాడుతున్నారు.

ఈ సంఘటనలు మొదలుకాగానే భారత జట్టు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. షాపింగ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఫోన్ చేసి హుటాహుటిన హోటల్‌కు పిలిపించారు. ఇంగ్లండ్ జట్టు బస చేస్తున్న 'హోటల్ హయత్" సిటీ సెంటర్ సమీపంలోనే ఉండగా... భారత జట్టు బస చేస్తున్న మారియట్ హోటల్ మాత్రం సిటీ సెంటర్‌కు కొద్ది దూరంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానానికి సమీపంలో భారత జట్టు బస చేస్తోంది. నిజానికి భారత ఆటగాళ్లు సోమవారం రాత్రి సిటీ సెంటర్‌లోనే డిన్నర్‌కు వెళదామనే ప్రణాళికలో ఉన్నారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది వద్దనడంతో హోటల్‌కే పరిమితమయ్యారు. మంగళవారం ఉదయం మళ్లీ నగరం అంతా ప్రశాంతంగా మారింది. దీంతో షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు మైదానానికి వచ్చి ప్రాక్టీస్ చేశారు.

ఈ సందర్బంలో టీమ్ ఇండియా కెప్టెన్ ధోని మాట్లాడుతూ జరుగుతున్న సంఘటనలు విచారకరమే అయినా, తాము దాని గురించి ఆలోచించడం లేదని అన్నారు. 'ఇది మా చే తుల్లో లేదు. భద్రత అనేది అధికారులు, బోర్డుల బాధ్యత. మా బాధ్యత క్రికెట్ ఆడటం, సరిగా సన్నద్ధం కావడం. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని ధోని అన్నాడు. ఒక దశలో మూడో టెస్టు రద్దవుతుందని వార్తలు వచ్చాయి. భారత మేనేజర్ ఒక ప్రకటనలో దీనిని ఖండించారు. భారత జట్టులో అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

అటు ఇంగ్లండ్ జట్టు కూడా పూర్తిగా సిటీ సెంటర్‌లో దాడులు జరిగిన ప్రాంతంలోనే ఉంది. ఏ చిన్న సంఘటన జరిగినా భయపడే ఇంగ్లండ్ క్రికెటర్లు ఈసారి మాత్రం ధైర్యంగానే ఉన్నామంటున్నారు. 'హోటల్ దాటి బయటకు రావద్దని మా భద్రత సిబ్బంది ఆదేశించారు. మేం దానిని పాటిస్తున్నాం. మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు" అని ఇంగ్లండ్ కెప్టెన్ స్ట్రాస్ అన్నాడు. 2008లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా... ముంబైలో బాంబు దాడులు జరగడంతో సిరీస్ మధ్యలో రద్దయింది. దీని గురించి ప్రస్తావించగా... 'అవి టెర్రరిస్టు దాడులు. అందుకే అప్పుడు మా భద్రత సిబ్బంది ఆదేశాల మేరకు వెనక్కు వచ్చాం. కానీ ఇప్పుడు జరుగుతోంది ఆందోళన. ఇది సమసిపోతుంది" అని స్ట్రాస్ చెప్పుకొచ్చాడు.

ముంబై దాడులతో పోలిస్తే... ఇంగ్లండ్‌లో అల్లర్లు చిన్నవే కావొచ్చు. నాటి తీవ్రత ఇప్పుడు లేకపోవచ్చు. కానీ అదే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు ముంబైలో ఉండి ఇదే తరహా ఆందోళనలు జరిగితే మాత్రం కచ్చితంగా వాళ్లు మరుసటి రోజే మూటాముల్లే సర్దేవారని క్రికెట్ పండితులు అంటున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+