Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాపై 311 పరుగుల ఆధిక్యం

Mahendra Singh Dhoni
మీర్పూర్: బంగ్లాదేశ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సును భారత్ ఎనిమిది వికెట్లకు 544 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్సుపై భారత్ కు 311 పరుగుల ఆధిక్యం లభించింది. భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొద్ది పరుగుల తేడాతో సెంచరీని జారవిడుచుకున్నాడు. ధోనీని 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రఖీబుల్ హసన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ మొహ్మద్ రహీమ్ స్టంప్ అవుట్ చేశాడు. ధోనీ 89 పరుగుల్లో 9 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కు మంగళవారం మరో దెబ్బ తగిలింది. యువరాజ్ సింగ్ మణికట్టుకు గాయమైంది. సోమవారం ద్రవిడ్ తీవ్రంగా గాయపడ్డాడు.

కాగా, భారత్ తొలి ఇన్నింగ్సులో ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ అద్భుతమైన సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్ 143 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్ ద్రావిడ్ 111 పరుగుల వద్ద గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. గౌతం గంభీర్ 68 పరుగులు, సెహ్వాగ్ 56 పరుగులు చేశారు. తొలి టెస్టులో భారత్ బంగ్లాదేశ్ పై గెలిచి సిరీస్ లో ముందంజలో ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+