For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కొత్త రికార్డు.... ఏంటా రికార్డు.. ఏమా కథ..?

India Creates history by bagging 7 medals in Olympics, the highest so far

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అద్భుతాలు చేసింది. భారత్ 7 పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఇంతకుముందు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు గెలుచుకోగా, 2016 ఒలింపిక్ క్రీడల్లో కేవలం 2 పతకాలు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి భారత జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. ఇది క్రీడాకారులకు ఒక విజయం మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో గర్వకారణం.

మొత్తం ఏడు పతకాలు

మొత్తం ఏడు పతకాలు

మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్‌లీనా బెర్గోహాన్, పురుషుల హాకీ జట్టు, రవి దహియా, బజరంగ్ పూనియా మరియు నీరజ్ చోప్రాలు భారతదేశం తరపున పతకాలు సాధించారు. దీంతో భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, 4 కాంస్య పతకాలను సాధించినట్లయ్యింది.

 దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి

దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి

వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను భారతదేశానికి మొదటి పతకాన్ని అందించింది. మీరాబాయి 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. దీంతో, వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌ తరపున పతకం సాధించిన రెండవ మహిళగా నిలిచింది. అంతకుముందు, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి రజత పతకం సాధించింది. మీరాబాయి మొత్తం 202కేజీల బరువు ఎత్తి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. స్నాచ్‌లో, క్లీన్ అండ్ జెర్క్‌లో రెండవ ప్రయత్నంలోనే 89 కిలోలు మరియు రెండవ ప్రయత్నంలో 115 కిలోల బరువును ఎత్తి రజత పతకం సాధించింది మీరాబాయ్

రెండో పతకం అందించిన పీవీ సింధు

రెండో పతకం అందించిన పీవీ సింధు

స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. సింధు 21-13, 21-15 తేడాతో చైనాకు చెందిన హి బింగ్జియావోను ఓడించి చారిత్రక పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. ఆమె 2016 రియోలో రజత పతకాన్ని గెలుచుకుంది. రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం మరియు 2012 గేమ్స్‌లో రజత పతకం సాధించారు.

మూడవ పతకం అందించిన లవ్లీనా

మూడవ పతకం అందించిన లవ్లీనా

69 కేజీల విభాగంలో, మహిళా బాక్సర్ లవ్లీనా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని తన కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనెల్లిని ఎదుర్కొంది, కానీ 23 ఏళ్ల లవ్లీనా 5-0తో బుసేనాజ్ చేతిలో ఓటమిపాలైంది. అయితే, కాంస్యం మాత్రం గెల్చుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారతీయ బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. అతని కంటే ముందు విజేందర్ సింగ్ (2008) మరియు MC మేరీ కోమ్ (2012) పతకాలు సాధించారు.

 నాల్గవ పతకం అందించిన రవి దహియా

నాల్గవ పతకం అందించిన రవి దహియా

రెజ్లర్ రవి దహియా భారతదేశానికి నాల్గవ ఒలింపిక్ పతకాన్ని సాధించాడు. రవి 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించాడు. అతను ఫైనల్‌లో రెండో సీడ్ రష్యన్ ఒలింపిక్ కమిటీ రెజ్లర్ జవూర్ యుగుయేవ్‌తో 4-7 తేడాతో ఓడిపోయాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి నిలిచాడు. అంతకు ముందు, సుశీల్ కుమార్ 2012 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు.

ఐదవ పతకం అందించిన హాకీ జట్టు

ఐదవ పతకం అందించిన హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఐదో పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత హాకీ క్రీడలో ఒక పతకం వచ్చింది. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారత్ ఈ పతకాన్ని సాధించింది.

ఆరవ పతకం అందించిన బజరంగ్

ఆరవ పతకం అందించిన బజరంగ్

రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా అద్భుతాలు చేశాడు. అతను సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు, కానీ కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. బజరంగ్ 8-0తో కజకిస్థాన్‌కు చెందిన డి నియాజ్‌బెకోను ఓడించి కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది రెండో పతకం.

ఏడవ పతకం సాధించిన నీరజ్ చోప్రా

ఏడవ పతకం సాధించిన నీరజ్ చోప్రా

నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌ ఈవెంట్‌లో భారతదేశానికి ఇదే మొదటి బంగారు పతకం కావడం విశేషం. నీరజ్ 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. ఇది తనకు వ్యక్తిగతంగా రెండవ బంగారు పతకం కూడా. అంతకుముందు, అభినవ్ బింద్ర 2008 ఒలింపిక్స్ గేమ్స్‌లో షూటింగ్‌లో స్వర్ణ పతకం సాధించాడు.

Story first published: Saturday, August 7, 2021, 19:46 [IST]
Other articles published on Aug 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+