Asian Shooting Championship 2025: చరిత్ర సృష్టించిన భారత్
Asian Shooting Championship 2025: కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో భారత షూటర్లు చరిత్ర సృష్టించారు. 12 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్ గతంలో ఎన్నడూ సాధించని రీతిలో అత్యధిక పతకాలను గెలుచుకుంది. మొత్తం 99 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతతో భారత్ ఆసియాలోనే నిజమైన షూటింగ్ సూపర్ పవర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనలో 50 స్వర్ణాలు, 26 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
పతకాల పట్టికలో తిరుగులేని ఆధిపత్యం
ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పట్టికలో భారత్ చూపించిన ఆధిపత్యం విశేషం. ఏకంగా 50 స్వర్ణ పతకాలతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం పతకాల సంఖ్యలో కజకిస్తాన్ (70 పతకాలు, 21 స్వర్ణాలు), చైనా (37 పతకాలు, 15 స్వర్ణాలు) భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. ఈ విజయం భారత్ యొక్క షూటింగ్ క్రీడలో పెరుగుతున్న శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా, సీనియర్ జట్టు ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 15 ఒలింపిక్ ఈవెంట్లలో, భారతీయ షూటర్లు 6 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సత్తా చాటారు. ఇది రాబోయే ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లకు మంచి సంకేతం.

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు వీరే..
ఆ మెగా ఈవెంట్‌లో అనేక మంది భారతీయ షూటర్లు వ్యక్తిగత రికార్డులను సృష్టించి, దేశానికి పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
ఎలవెనిల్ వలరివాన్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఆమె ప్రదర్శన ఓ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పింది. దీంతో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. అంతేకాకుండా.. అర్జున్ బాబుతతో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కూడా స్వర్ణం సాధించి తన సత్తా చాటుకుంది.
నీరు ధండా: మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత్‌కు మొదటి స్వర్ణం అందించిన ఘనత ఆమెకే దక్కుతుంది.
సిఫ్ట్ కౌర్: మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ-పొజిషన్ ఈవెంట్‌లో తన మొదటి ఆసియా టైటిల్‌ను గెలుచుకుని భవిష్యత్తుపై ఆశలు రేపింది.
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ ఈవెంట్‌లో ఫైనల్లో 462.5 స్కోర్ చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. అతను చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థి ఝావో వెన్యు (462.0)ను ఓడించి ఈ విజయాన్ని సాధించాడు.
రాజ్‌కన్వర్ సింగ్ సంధు: 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో స్వర్ణం సాధించి తన నైపుణ్యాన్ని చాటాడు.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 182 మంది అథ్లెట్లు పాల్గొని 99 పతకాలు సాధించారు. ఇందులో 55 వ్యక్తిగత ఈవెంట్లలో గెలుచుకోగా, మిగిలినవి టీమ్ ఈవెంట్లలో వచ్చాయి. ఈ ప్రదర్శన భారత షూటింగ్ క్రీడా భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని నిరూపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications