Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉత్కంఠ మ్యాచులో భారత్ గెలుపు

Mahendra Singh Dhoni
రాజ్ కోట్: తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తొలి వన్డే క్రికెట్ మ్యాచులో భారత్ విజయం సాధించింది. కేవలం మూడు పరుగుల తేడాతో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో భారత్ పెట్టిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మూడు పరుగులు వెనక పడిపోయింది. శ్రీలంక 411 పరుగులు చేసింది. శ్రీలంక భారత్ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుందని అనుకున్న సమయంలో చివరి నిమిషాల్లో వెనకడుగు వేసింది. దిల్షాన్, తరంగ అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. సంగక్కర, దిల్షాన్ కలిసి పరుగుల వరద పారించారు. దిల్షాన్ 124 బంతుల్లో 160 పరుగులు చేశాడు. సంగక్కర 43 బంతుల్లో 90 పరుగులు చేశాడు. తరంగ 67 పరుగులు చేశారు. వీరి తర్వాత మరెవ్వరూ నిలదొక్కుకోకపోవడం శ్రీలంకకు శాపంగా మారింది.

అంతకు ముందు శ్రీలంకపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో భారత్ మంగళవారం భారీ స్కోరు సాధించింది. శ్రీలంకకు 415 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోరు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఇంతకు ముందు భారత వన్డేల్లో బెర్ముడాపై 414 పరుగులు అత్యధికం. వీరేంద్ర సెహ్వాగ్ తన సహజమైన ధోరణిలో విరుచుకుపడి భారీ స్కోరుకు పునాది వేశాడు. సెహ్వాగ్ 102 బంతుల్లో ఆరు సిక్స్లులు, 17 ఫోర్లతో 146 పరుగులు చేశాడు. సెహ్వాగ్ తో కలిసి తొలి వికెట్ కు 153 పరుగుల భాగస్వామ్యాన్ని, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి రెండో వికెట్ కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెహ్వాగ్ కు ఇది వన్డేల్లో 12వ సెంచరీ. 66 బంతుల్లో సెహ్వాగ్ సెంచరీ సాధించాడు.

కాగా, సచిన్ టెండూల్కర్ 63 బంతుల్లో 69 పరుగులు చేసి దిల్హా ఫెర్నాండో బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా దూకుడుగా ఆడాడు. అతను 53 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్ లు ఉన్నాయి. సురేష్ రైనా, గంభీర్, హర్భజన్ సింగ్ పెద్దగా రాణించకపోయినా చివరలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా స్కోరు పెంచారు. కోహ్లీ 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కాగా, రవీంద్ర జడేజా రెండు సిక్సులు ఒక ఫోర్ తో 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. కులశేఖర, వెలెగెదర, ఫెర్నాండో రెండేసి వికెట్లు తీసుకున్నారు. మాథ్యూస్ కు ఒక వికెట్ లభించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+