న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూత్ బాక్సింగ్‌లో భారత్ రికార్డు: ఐదు స్వర్ణాలు గెలిచిన అమ్మాయిలు

By Nageshwara Rao
India claim 5 gold medal, become champions at World Youth Boxing

హైదరాబాద్: గువహటి వేదికగా జరిగిన వరల్డ్ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. మన దేశం తొలిసారి ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అద్భుత ప్రదర్శనతో ఐదు విభాగాల్లోనూ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.

టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అనుక్షిత బొరొ (64 కేజీలు) తమ విభాగాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి స్వర్ణాలు గెలవగా నేహా యాదవ్(81 కేజీలు), అనుపమ(81 కేజీలు) కాంస్కాలు దక్కించుకున్నారు.

నీతు 5-0తో జజిరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్‌)పై, జ్యోతి 5-0తో ఎకతెరినా మొల్చనొవా (రష్యా)పై, సాక్షి 3-2తో ఇవీ జేన్‌ స్మిత్‌ (ఇంగ్లండ్‌)పై, శశి 4-1తో ఎన్గొక్‌ డొ హంగ్‌ (వియత్నాం)పై, అంకుశిత 4-1తో ఎకతెరినా డింక్‌ (రష్యా)పై విజయం సాధించారు. తాజా పసిడితో వచ్చే ఏడాది అర్జెంటీనాలో జరిగే యూత్ ఒలింపిక్స్ క్రీడలకు జ్యోతి అర్హత సాధించింది.

టోర్నీ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. స్వర్ణ పతకాలు సాధించిన బాక్సర్లకు భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ తలా రూ.2 లక్షల నజరానా ప్రకటించారు. మరోవైపు ప్రేక్షకుల గ్యాలరీలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల బౌట్లను 45 నిమిషాల పాటు నిలిపివేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 27, 2017, 17:50 [IST]
Other articles published on Nov 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X