ఆతిథ్యం కోసం భారత్ ఉత్సాహం: 2026 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్

హైదరాబాద్: ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత్, రాబోయే రోజుల్లో మూడు మెగా ఈవెంట్లకు ఆతిథ్యమివ్వాలని ఉత్సాహం చూపుతోంది. ఇందులో భాగంగా 2026 యూత్ ఒలింపిక్స్, 2030 ఆసియా క్రీడలు, 2032 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్‌లు వేయాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయించింది.
ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపాడు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్‌ను కలిసిన నరీందర్ బాత్రా ఈ మేరకు ప్రతిపాదన చేశాడు. గురువారం బాత్రా మాట్లాడుతూ '2026 యూత్ ఒలింపిక్స్, 2030 ఆసియా క్రీడలు, 2032 ఒలింపిక్స్‌ల ఆతిథ్యానికి బిడ్ వేయాలని నిర్ణయించాం' అని అన్నాడు.

పోటీ ఎలా ఉంటుందో చూద్దాం
'ఆ టోర్నీల ఆతిథ్యం భారత్‌కు దక్కుతుందో లేదో తెలియదు. పోటీ ఎలా ఉంటుందో చూద్దాం' అన్నాడు. ఇలాంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమివ్వడం వల్ల భారత్‌లో క్రీడాభివృద్ధి మరింత మెరుగు అవుతుందని, ఇక్కడి అథ్లెట్లకు ఎంతో మేలు జరుగుతుందని నరీందర్ బాత్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐఓఏ నిర్ణయానికి అభినందనలు
బాత్రా ప్రతిపాదనపై ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ మాట్లాడుతూ 'యూత్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఐఓఏ నిర్ణయానికి అభినందనలు. సొంతగడ్డపై ఒలింపిక్స్ జరిగితే భారత క్రీడాకారులు ఎంతగానో స్ఫూర్తి పొందుతారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపుతుంది. ఒలింపిక్స్ ఆతిథ్యం భారత క్రీడాభివృద్ధికి దోహద పడుతుంది' అని అన్నారు.

కాలేదు
2026 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్ వేసుకోవచ్చు
'అయితే దీనిపై పూర్తిస్థాయిలో చర్చించడానికి ఇది సమయం కాదు. ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ బిడ్‌ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. 2026 యూత్ ఒలింపిక్స్‌కు బిడ్ వేసుకోవచ్చు. కానీ మేమింకా 2022 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్నే ఎంపిక చేయలేదు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది' అని అన్నారు.
ఆతిథ్య దేశాన్ని
'2022 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని నిర్ణయించిన తర్వాతే 2026 క్రీడల బిడ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2032 సమ్మర్ ఒలింపిక్స్ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించడానికి చాలా సమయం పడుతుంది. 2025లో ఆతిథ్య నగరాన్ని త్వర్లోనే ప్రకటిస్తాం' అని థామస్ బాక్ తెలిపాడు. మరోవైపు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను కూడా బాక్ కలిశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications