మొత్తం భారత్‌కు 21పతకాలు: ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్: పదవ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్ 2017 డిసెంబరు 12 న జరిగింది. జపాన్ లోని వాకా నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్ తరపును పాల్గొన్న సౌరభ్ చౌదరి, మను బాకర్ ఒకరు స్వర్ణం గెలుచుకోగా ఇంకొకరు వెండిని గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ 243.1 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను బాకెర్ (236 పాయింట్లు) రజతం గెలిచింది.
ఈ క్రమంలో వచ్చే ఏడాది జరుగనున్న యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌కు సౌరభ్ చౌదరీ, మను బాకెర్ అర్హత సాధించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి టీమ్ విభాగంలో అర్జున్ సింగ్ చీమా, సౌరభ్, సురీందర్‌ల బృందం పసిడిని చేజిక్కించుకుంది. ఈమెతో పాటు యశస్విని, మహిమా ఆగర్వాల్, యోగిత టీమ్‌కు రజతం నెగ్గింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం 21 పతకాలు వచ్చాయి. (6 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలు)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications