ఆసియా అథ్లెటిక్స్: అగ్రస్థానంలో భారత్, ఒకేరోజు నాలుగు స్వర్ణాలు
హైదరాబాద్: టాప్-3లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్‌లో సత్తా చాటుతోంది. రెండో రోజు భారత అథ్లెట్లు సత్తా చాటారు. తొలిరోజు రెండు స్వర్ణాలు తెచ్చిన భారత అథ్లెట్లు రెండోరోజు ఏకంగా నాలుగు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు కైవసం చేసుకున్నారు.
వర్షం కారణంగా కొన్ని ఈవెంట్లకు అంతరాయం కలిగినా శుక్రవారం ఎనిమిది పతకాలు నెగ్గిన భారత్ మొత్తంగా 15 పతకాలతో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. 400 మీటర్ల పరుగులో మహమ్మద్ అనాస్, నిర్మలా షెరాన్, 1500 మీటర్ల పరుగు పందెంలో అజయ్ కుమార్, పి.యు చిత్ర స్వర్ణ పతకాలు సాధించారు.

కాంస్యంతో సరిపెట్టిన ద్యూతీ చంద్
ఇక భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్ మాత్రం కాంస్యంతో సరిపెట్టింది. పురుషుల 400 మీటర్లలో అనాస్ 45.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించాడు. మరో భారత అథ్లెట్ రాజీవ్ అరోకియా (46.14 సె) రజతం నెగ్గాడు. మహిళల 400 మీ పరుగులో మన అమ్మాయిలు సత్తా చాటారు.

బంగారు పతకం నెగ్గిన నిర్మలా షెరాన్
మహిళల 400 మీటర్ల ఫైనల్ పరుగును 52.01 సెకన్లలో పూర్తి చేసిన నిర్మలా షెరాన్ బంగారు పతకం సాధించగా, భారత్‌కే చెందిన జిస్నా మాథ్యూ (53.32) కాంస్యం నెగ్గింది. పూవమ్మ (53.36 సె) నాలుగో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ సరోజ్ (3.48.85 ని) స్వర్ణం నెగ్గాడు.

1500 మీటర్ల పరుగులో చిత్రకు పసిడి పతకం
కతార్ రన్నర్ జమాల్ హైరేన్ (3:46.90) రజతం, ఇరాన్‌కు చెందిన నియాదూస్త్ (3:48.53) కాంస్యం గెలిచారు. అదే మహిళల 1500 మీటర్ల పరుగులో చిత్ర (4.17.92 ని) టైమింగ్‌తో ముగించిన పి.యు. చిత్ర పసిడి కైవసం చేసుకుంది. ఆఖర్లో జరిగిన మహిళల 100 మీటర్ల పరుగులో ఒడిషా అథ్లెట్ ద్యుతిచంద్‌కు నిరాశ ఎదురైంది.

రజతం నెగ్గిన తేజీందర్ సింగ్ పాల్
ఆమె 11.52 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌నకు అర్హత సాధించాలన్న ఆమె కల నెరవేరలేదు. పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో గుండును 19.77 మీటర్లు విసిరిన తేజీందర్ సింగ్ పాల్ భారత్ ఖాతాలో రజతం చేర్చాడు. ఈ విభాగంలో ఓం ప్రకాశ్‌సింగ్ (18.70 మీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. ట్రిపుల్‌జంప్‌లో అర్పిందర్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications