Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్: పతకాలు సాధించిన భారత క్రీడాకారులు (ఫోటోలు)

India at Asian Games 2018: Full List of Winners at Asian Games

జకార్తా: ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాగ్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో షూటర్లు, రెజ్లర్లు భారత్‌కు పోటీ పడి మరీ పతకాలు సాధించిపెడుతున్నారు. ఇప్పటివరకు భారత్ 10 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. ఇందులో 6 పతకాలను షూటర్లు సాధించగా మరో 3 పతకాలు రెజ్లర్లు అందించారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్, రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా, 16 ఏళ్ల షూటర్ సౌరభ్ చౌదరిలు భారత్‌కు స్వర్ణ పతకాలను అందించిన వారిలో ఉన్నారు. ఈ ఆసియా గేమ్స్‌లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి చరిత్ర సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ ఫైనల్‌లో 240.7 పాయింట్స్‌తో ఆసియా గేమ్స్‌లోనే అత్యధిక పాయింట్స్ నమోదు చేసిన షూటర్‌గా ఘనత సాధించాడు.

దీంతో పాటు గత 24 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న జస్పాల్ రానా రికార్డుని కూడా సౌరభ్ బద్దలు కొట్టాడు. 1994 హిరోషిమా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో 25 మీటర్ల సెంటర్ పిస్టల్ ఈవెంట్‌లో జస్పాల్ రానా 17 ఏళ్ల వయసులోనే ఆసియా గేమ్స్‌‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన భారత షూటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.

ఇప్పుడు, జస్పాల్‌ను వెనక్కునెట్టి ఆసియా గేమ్స్‌ షూటింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అత్యంత పిన్న వయస్కుడిగా సౌరభ్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఈ ఆసియా గేమ్స్‌లో తొలిసారిగా భారత్ సెపక్‌తక్రాలో పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఈ విభాగంలో భారత్‌కు ఏ పతకం లభించలేదు.

సెపక్ తక్రా రెగు ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. మంగళవారం థాయ్‌లాండ్‌తో జరిగిన పురుషుల సెపక్‌తక్రా సెమీఫైనల్‌లో భారత్‌ ఓటమిపాలైంది.

దివ్య కాక్రన్

దివ్య కాక్రన్

రెజ్లింగ్ పోటీల్లో మహిళల 68 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో భారత్‌కు చెందిన దివ్య కాక్రన్ కాంస్యంలో మెరిసింది. చైనీస్ తైపీకి చెందిన తన ప్రత్యర్ధి చెన్ వెన్‌లింగ్‌పై సాంకేతికంగా 10-0తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకముందు పురుషుల విభాగంలో భజరంగ్ పూనియా, మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్‌లు స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

సెపక్‌ తక్రా

సెపక్‌ తక్రా

ఆసియా క్రీడల్లో భారత సెపక్‌ తక్రా జట్టు సంచలనం సృష్టించి కాంస్యాన్ని ఖాయం చేసింది. చరిత్రలో ఇప్పటివరకూ సెపక్ తక్రాలో పతకం దక్కిన దాఖలాలు లేవు. ఆసియా క్రీడల్లోని మూడో రోజున తొలిసారి దేశానికి పతకాన్ని సాధించిన భారత జట్టు చరిత్రను లిఖించింది. సెమీస్‌ చేరిన జట్లకు గెలుపోటములతో సంబంధం లేకుండా కాంస్య పతకాలు అందజేస్తారు.

సంజీవ్ రాజ్‌‌పుత్‌

సంజీవ్ రాజ్‌‌పుత్‌

50 మీటర్ల విభాగంలో 3 స్థానాల్లో రైఫిల్ షూటింగ్‌ చేసిన సంజీవ్ రాజ్‌పుత్ రజిత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన రాజ్‌పుత్ కేవలం 0.4 పాయింట్ల వ్యత్యాసంతో స్వర్ణాన్ని కోల్పోయాడు. ఫైనల్స్‌ ఆరంభంలో కాస్త తడబడిన సంజీవ్ సహనంతో సాధించి ఎట్టకేలకు రజితాన్ని దక్కించుకున్నాడు.

అభిషేక్‌ వర్మ

అభిషేక్‌ వర్మ

మూడో రోజు భారత్ స్వర్ణంతో ఖాతా తెరిచిన జాబితాలో మరో పతకం వచ్చి చేరింది. స్వర్ణాన్ని గెలిచిన సౌరబ్ చౌదరీతో పాటుగా ఫైనల్‌కు అర్హత సాధించిన అభిషేక్ వర్మ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు.

 సౌరభ్ చౌదరి

సౌరభ్ చౌదరి

మూడో రోజైన మంగళవారం పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇద్దరు భారతీయులు పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ ఫైనల్‌‌లో 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరి షూటింగ్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ ఫైనల్‌లో 240.7 పాయింట్స్‌తో ఆసియా గేమ్స్‌లోనే అత్యధిక పాయింట్స్ నమోదు చేసిన షూటర్‌గా ఘనత సాధించాడు. దీంతో పాటు గత 24 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న జస్పాల్ రానా రికార్డుని కూడా సౌరభ్ బద్దలు కొట్టాడు. 1994 హిరోషిమా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో 25 మీటర్ల సెంటర్ పిస్టల్ ఈవెంట్‌లో జస్పాల్ రానా 17 ఏళ్ల వయసులోనే ఆసియా గేమ్స్‌‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన భారత షూటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు, జస్పాల్‌ను వెనక్కునెట్టి ఆసియా గేమ్స్‌ షూటింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అత్యంత పిన్న వయస్కుడిగా సౌరభ్ చరిత్ర సృష్టించాడు.

వినేష్ ఫోగట్

వినేష్ ఫోగట్

రెజ్లింగ్‌లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఇరి యుకిపై 6-2తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఆసియా గేమ్స్‌లో ఓ మహిళా రెజ్లర్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఆమె రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. మొత్తంగా చూస్తే ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.

లక్ష్యయ్‌

లక్ష్యయ్‌

భారత్ నుంచి మరో షూటర్ లక్ష్యయ్ షెరోన్ వెండి పతకం సాధించాడు. ఈ 19ఏళ్ల యువ షూటర్ ఫైనల్‌కు మెరుగైన స్థాయిలో అర్హత సాధించి 43/50 స్కోరుతో రౌండ్ ముగించాడు. ఈ పోటీలోనూ చైనాకు చెందిన యాంగ్ కుంపీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండవ సిల్వర్ మెడల్ కావడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో షూటర్ మాన‌వ్‌జీత్‌ సందూ నాలుగవ స్థానంలో నిలిచాడు. మెన్స్ ట్రాప్ ఫైనల్లో 48 టార్గెట్‌లకు గాను లక్షయ్య మొత్తం 42 టార్గెట్లను ఫినిష్ చేశాడు.

దీపక్ కుమార్‌

దీపక్ కుమార్‌

పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో షూటర్ దీపక్ కుమార్‌కు సిల్వర్ పతకం దక్కింది. దీపక్ 247.7 పాయింట్లతో రెండో స్థానంలో పోటీని ముగించాడు. ఈ పోటీలో చైనాకు చెందిన హారన్ యాంగ్ 249.1 పాయింట్లతో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.

 బజ్‌రంగ్ పూనియా

బజ్‌రంగ్ పూనియా

ఆసియా గేమ్స్‌లో భాగంగా రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పూనియా విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో యోగేశ్వర్‌దత్‌ (2014), కర్తార్‌సింగ్‌ (1978, 86), సత్పాల్‌సింగ్‌ (1982), రాజిందర్‌సింగ్‌ (1978), చంగ్డిసింగ్‌ (1970) తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా భజరంగ్‌ నిలిచాడు. అంతేకాకదు ఒకే ఏడాది కామన్వెల్త్‌, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన భారత మూడో రెజ్లర్‌ భజరంగ్‌.

 అపూర్వ చండేలా, రవి కుమార్‌

అపూర్వ చండేలా, రవి కుమార్‌

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌‌లో అపూర్వ చండేలా, రవి కుమార్‌‌లు కాంస్యం సొంతం చేసుకున్నారు.

Story first published: Tuesday, August 21, 2018, 19:57 [IST]
Other articles published on Aug 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+