
హైదరాబాద్: గౌహతి వేదికగా జరుగుతున్న మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. భారత్‌కు చెందిన ఏడుగురు బాక్సర్లు సెమీస్‌కు చేరడంతో ఏడు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన పోటీల్లో ఐదుగురు అమ్మాయిలు సెమీస్‌కు దూసుకెళ్లారు.
జ్యోతి గులియా (51 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు), నీతూ (48 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు)లు బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో విజయం సాధించారు. సెమీస్‌లో వీరు ఓడినా కనీసం కాంస్యమైనా దక్కుతుంది.
జ్యోతి 5-0తో గియావాన్నా మార్చీస్ (ఇటలీ)పై, శశి 5-0తో సందుగశ్ అబిల్‌కన్ (కజకిస్థాన్)పై ఘన విజయం సాధించగా.. అంకుశిత ఇటలీ బాక్సర్ రెబెక్కా నికోలిని ఓడించింది. మాక్సి క్లోట్జర్ (జర్మనీ)పై నీతు, లు జియా (చైనా)పై సాక్షి గెలిచారు. తెలుగమ్మాయి గోనెల్ల నిహారిక (75 కిలోలు) పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

ఇంగ్లాండ్ బాక్సర్ జార్జియా ఓ కానర్ చేతిలో ఆమె ఓటమి పాలైంది. మరోవైపు కాన్‌సెర్ ఒల్టు (టర్కీ) చేతిలో అస్థా పాహ్వా (69 కేజీలు) ఓడిపోయింది. నేహా యాదవ్ (ప్లస్ 81 కేజీలు), అనుపమ (81 కేజీలు) ఇది వరకే సెమీస్ చేరారు. 2011లో ఈ టోర్నీ ప్రవేశపెట్టిన తర్వాత భారత్ ఒక్కసారి కూడా స్వర్ణం నెగ్గలేదు.
గత టోర్నీలో భారత్ కేవలం ఒక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది మాత్రం ఏకంగా ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.