Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ రికార్డు: భారత్ 311/5

Sachin Tendulkar
మొహాలి: ఆస్ట్రేలియాతో మొహాలిలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సు తొలి రోజు ఆటలో భారత్ నిలకడగా ఆడి పటిష్ట స్థితికి చేరుకుంటోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టు మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించడం శుక్రవారంనాటి ఆట విశేషం. అతను బ్రియాన్ లారా 11,9953 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతే కాకుండా 12 వేల పరుగుల మైలురాయి కూడా దాటాడు.

టెండూల్కర్ 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిడిల్ బౌలింగులో హేడెన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భారత్ స్కోర్ 305 పరుగులు ఉండగా టెండూల్కర్ అవుటయ్యాడు. గంగూలీ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను టెస్టు మ్యాచుల్లో 7 వేల పరుగుల మైలు రాయి దాటాడు. టెండూల్కర్ అవుటైన తర్వాత ఇషాంత్ శర్మ నైట్ వాచ్ మన్ గా బ్యాటింగుకు దిగాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. గంగూలీ 54 పరుగులతో, ఇషాంత్ శర్మ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభం బాగానే ఉన్నప్పటికీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. లంచ్ తర్వాత భారత వికెట్ల పతనం ప్రారంభమైంది. సెహ్వాగ్ 35 పరుగులు చేసి అవుట్ కాగా గౌతం గంభీర్ 67 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ 39 పరుగులు చేయగా వివియస్ లక్ష్మణ్ 12 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. జాన్సన్ 3 వికెట్లు తీసుకోగా బ్రెట్ లీకి ఒక వికెట్ వచ్చింది.
Story first published: Friday, October 17, 2008, 18:12 [IST]
Other articles published on Oct 17, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+