రియో ఒలింపిక్స్: భారత్‌కు మరో దెబ్బ, ఇంద్రజిత్ కూడా
ఢిల్లీ: రియో ఇలింపిక్స్‌కు ముందు భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, మరో క్రీడాకారుడు డోప్ టెస్టులో విఫలమయ్యాడు.
షాట్‌పుట్ ఆటగాడు ఇంద్రజిత్ సింగ్ ఉత్ప్రేరకాలు వాడినట్లు వెల్లడైంది. గత నెల 22వ తేదీన నిర్వహించిన డోప్ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడు. ఆ పై బీ శాంపిల్ పరీక్షల్లోను అదే ఫలితం వచ్చింది.త రియోలో జరిగే షాట్ పుట్‌పుట్ విభాగంలో ఇంద్రజిత్ పాల్గొనాల్సి ఉంది.
డోప్ టెస్టులో విఫలం కావడంతో ఇంద్రజిత్ సింగ్ రియో ఒలంపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేవని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఈ విషయమై అథ్లెటిక్ సమాఖ్యకు మంగళవారం నాడు లేఖ రాయనుంది.

ఇంద్రజిత్ సింగ్
ఇంద్రజిత్ సింగ్ ఆసియా ఛాంపియన్ షిప్, ఆసియా గ్రాండ్ ఫ్రీ, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లలో గత ఏడాది పాల్గొన్నాడు. అతను స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఇంద్రజిత్ సింగ్
రియోకు అర్హత సాధించటిన తొలి అథ్లెట్ ఇలా నిషేధిత ఉత్ర్పేరకాలు వాడటంతో భారత్ మరింత ఆందోళన చెందుతోంది. ఇంచియాన్‌లో జరిగిన గేమ్స్‌లో కాంస్య పథకాన్ని ఇంద్రజిత్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు.

నర్సింగ్ యాదవ్
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో రెజ్లర్ నర్సింగ్‌యాదవ్ విఫలం కావడంతో రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ అంశంలో భారత ఆశలపై నీలి నీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. అతడి నుంచి తీసుకున్న 'ఏ' నమూనాతో పాటూ 'బి' నమూనాలోనూ నిషేధిత మిథేనడైనన్ అనే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తేల్చిచెప్పడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

నర్సింగ్ యాదవ్
అయితే, తన పైన కుట్ర జరిగిందని నర్సింగ్ యాదవ్ తెలిపారు. మరోవైపు, అతని స్థానంలో సుశీల్ కుమార్‌కు అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా జరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications