
ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఇండియా - ఇంగ్లాండ్ సిరిస్ లార్డ్స్ మైదానంలో జరిగిన మొట్టమొదటి టెస్టులో టీమ్ ఇండియాపై ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్స్ అయిన టీమ్ ఇండియా మొదటి టెస్టులో ఓటమిని చవిచూడడంతో రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై తన సత్తా చూపిస్తామని టీమ్ ఇండియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మొదటి టెస్టులో కేవలం 3గంటలు ఆడినటువంటి ఇండియా ఫేసర్ జహీర్ ఖాన్ ఆ తర్వాత టెస్టుకు దూరమయిన విషయం తెలిసిందే. అతని స్దానంలో రెండవ టెస్టుకి మరో ఇండియన్ ఫేసర్ శ్రీశాంత్‌ని జట్టులోకి తీసుకోవడం జరిగింది.
రెండో టెస్టులో టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని ఇంగ్లాండ్‌కి బౌలింగ్ వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మొదటి టెస్టులో బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి మోచేతికి తగలడంతో గాయం పాలైన ఓపెనర్ గౌతమ గంభీర్ రెండో టెస్టు బరిలోకి దిగలేదు. గంభీర్ స్దానంలో యువరాజ్ సింగ్‌ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా జహీర్ ఖాన్ స్దానంలో మునాఫ్ పటేల్, శ్రీశాంతా అన్న సందిగ్దంలో ఉన్న ధోని శ్రీశాంత్‌నే జట్టులోకి తీసుకోవడం జరిగింది. యువరాజ్ సింగ్, సురేష్ రైనా ఇద్దరూ కూడా రెండో టెస్టులో తమ బౌలింగ్ ప్రావీణ్యం పరీక్షించుకోనున్నారు.
నిన్న ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో హైదరాబాద్ సోగసరి బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై తమ సత్తా చూపిస్తామని అన్నారు. దీనితో పాటు రెండో టెస్టుకి జహీర్ మాకు దూరమవటం జట్టుకు బాధ కలిగించే విషయమే. మొదటి టెస్టులో కేవలం 13.3 ఓవర్లు మాత్రమే వేసిన అతను ఆ తరవాత గాయం బారిన పడటం మాకు ఎంతో నిరాశను కలిగించింది. తొలి టెస్టులో జహీర్ కనక మాకు అందుబాటులో ఖచ్చితంగా ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే కట్టడి చేసేవాళ్లం. 150 - నుంచి 200 పరుగులు జహీర్ నిరోధించేవాడని అన్నారు.