Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో ఓటమి దిశగా భారత్, కుక్ ట్రిపుల్ సెంచరీ మిస్

Alastair Cook
బర్మింగ్‌హామ్: ఇంగ్లాండుపై మరో ఓటమి దిశగా భారత క్రికెట్ జట్టు అడుగులు వస్తోంది. భారత బౌలర్లు ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్‌పై ఏ విధమైన ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను చితకబాదేశారు. దీంతో భారత్ మరో ఓటమికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అదే సమయంలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయే దిశగా పయనిస్తోంది. అలెస్టర్ కుక్ ట్రిపుల్ సెంచరీ మిస్సయ్యాడు. అనతు 294 పరుగులు చేశాడు. మోర్గాన్ సెంచరీ (104) పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండు 710 భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏదో పొడిచేస్తాడంటూ ఆఘమేఘాల మీద రప్పించిన సెహ్వాగ్ మరోసారి డకవుట్ అయ్యాడు. గంభీర్ (14), రాహుల్ ద్రావిడ్ (18) క్రీజులో ఉన్నారు. ఈ స్థితిలో భారత్ ఓటమి ఖరారైనట్లే కనిపిస్తోంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. ఇంగ్లాండు 486 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+