Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ భరతం పడుతున్న స్టువర్ట్‌ బ్రాడ్ హాట్రిక్‌ వికెట్లు

England 24/1 at stumps on Day 2
నాటింగ్‌హామ్‌:ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగులకు ఆలౌటైంది. 67 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచిన రాహుల్‌ ద్రవిడ్‌ (117; 235 బంతుల్లో 15X4) వరుసగా రెండో టెస్టులోనూ శతకం సాధించాడు. అతనికి యువరాజ్‌సింగ్‌ (62; 115 బంతుల్లో 10X4) చక్కటి సహకారమందించాడు. హ్యాట్రిక్‌ వీరుడు స్టువర్ట్‌ బ్రాడ్‌ (6/46) భారత్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుపడ్డాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌ మూడో రోజూ కొనసాగుతుందనుకుంటున్న దశలో బ్రాడ్‌ చెలరేగిపోయాడు. మొదట యువరాజ్‌ను కీపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చిన అతను.. 88వ ఓవర్లో హ్యాట్రిక్‌ సాధించాడు. మూడో బంతికి ధోనీ (5) స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వగా.. హర్భజన్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి భజ్జీ బ్యాట్‌కు తాకినా అంపైర్‌ వేలెత్తేశాడు. తర్వాతి బంతికి ప్రవీణ్‌ను బౌల్డ్‌ చేయడంతో బ్రాడ్‌ హ్యాట్రిక్‌ పూర్తయింది. బ్రెస్నన్‌ వేసిన తర్వాతి ఓవర్లో ద్రవిడ్‌.. కుక్‌ చేతికి చిక్కాడు. కాసేపటికి ఇషాంత్‌ను ఔట్‌ చేసి భారత ఇన్నింగ్స్‌ను బ్రాడ్‌ ముగించాడు.

భారత్‌తో సిరీస్‌కు ఫిన్‌ను కాదని స్టువర్ట్‌ బ్రాడ్‌కు చోటివ్వడంపై పదిరోజుల క్రితం గట్టిగానే విమర్శలొచ్చాయి ఇంగ్లాండ్‌లో. కానీ ఇప్పుడు ఆ బ్రాడే భారత్‌ భరతం పడుతున్నాడు. తొలి టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 4 వికెట్లతో దెబ్బ తీసిన బ్రాడ్‌.. తర్వాత ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో విలువైన ఇన్నింగ్స్‌ (74 నాటౌట్‌) ఆడాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లోనూ 3 వికెట్లు తీశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టులో బ్రాడ్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో 124/8తో ఉన్న ఇంగ్లాండ్‌ను విలువైన అర్ధశతకం(64)తో 221 పరుగులకు చేర్చాడు. తర్వాత బంతితోనూ చెలరేగాడు. సాఫీగా సాగిపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+