ఇంగ్లాండ్‌తో రెండవ వన్డే, పార్దీవ్ మెరుపు ఇన్నింగ్స్

రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయానికి 23 ఓవర్లలో 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక విజయాన్ని రుచి చూపించాల్సిన బాధ్యత బౌలర్లదే. రహానే నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించడంతో పాటు... రైనా మెరుపు వేగంతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించడంతో... భారత జట్టు 23 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
రోజ్‌బౌల్‌లో జరుగుతున్న రెండో వన్డేను వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత యువ ఓపెనర్ రహానే (47 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి రాణించి అర్ధసెంచరీ సాధించగా... పార్థీ వ్ పటేల్ (18 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ద్రవిడ్ (31 బంతుల్లో 32; 2 ఫోర్లు) మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను స్థిరపరిచాడు. ఇక స్లాగ్ ఓవర్లలో రైనా (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్, బ్రెస్నన్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.
తొలి ఓవర్లో రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పార్థీవ్ పటేల్ బ్రెస్నన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. పార్థీవ్ దూకుడుగా ఆడటంతో భారత్ మూడు ఓవర్లలోనే 29 పరుగులు చేసింది. కానీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రీప్లేలో ఇది నాటౌట్‌గా తేలింది. హాట్‌స్పాట్‌లో బంతి ఎక్కడా బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదు. ద్రవిడ్ తన శైలిలో ఆచితూచి ఆడుతూ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. రెండో ఎండ్‌లో రహానే మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్‌లెగ్‌లోకి కళ్లుచెదిరే సిక్సర్ కొట్టిన ఓపెనర్... సమయస్ఫూర్తితో ఆడాడు. ద్రవిడ్, రహానే కలిసి రెండో వికెట్ కు 79 పరుగులు జోడించాక... ద్రవిడ్ అవుటయ్యాడు. కోహ్లి కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. రహానే 40 బంతుల్లో తొలి అంతర్జాతీయ వన్డే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కండరాల నొప్పితో బాధపడ్డ రహానే అవుటయ్యాక రైనా షో మొదలైంది. డెర్న్ బాచ్ బౌలింగ్‌లో రెండు అద్భుతమైన సిక్సర్లు బాదిన రైనా వేగంగా ఆడాడు. కెప్టెన్ ధోని భారీ షాట్‌కు వెళ్లి అవుటవడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రెస్నన్ బౌలింగ్‌లో రైనా కవర్స్‌లోకి కళ్లుచెదిరే సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరోసారి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో బెల్ అద్భుతమైన క్యాచ్‌తో మనోజ్ తివారీ కూడా వెనుతిరిగాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications