
టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ 12వ రోజు భారత పరాజయాలను చవి చూస్తూ వస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్ నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌కు చేరలేకపోయింది. అయినప్పటికీ.. మూడో స్థానం కోసం మన్‌ప్రీత్ సింగ్ టీమ్ మరో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఇందులో నెగ్గితే- భారత్‌కు మరో కాంస్య పతకు అందుతుంది. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు.. కాంస్య పతకం కోసం సాగిన పోరాటం విజయవంతంగా ముగిసింది. మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో హాకీ జట్టు కూడా పీవీ సింధు సాధించిన ఫీట్‌ను రిపీట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
కాగా- టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి ప్లేయర్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌కు టోక్యో ఒలింపిక్స్ అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. సరికొత్త భారత దేశాన్ని ఆవిష్కరించేలా ప్రతి అథ్లెట్‌లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు. ప్రతి ఈవెంట్‌లోనూ భారత ప్లేయర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని చెప్పుకొచ్చారు. తమ కంటే అత్యుత్తమ ర్యాంకింగ్‌లో ఉన్న దేశాలు, అథ్లెట్లను భారత్ ఓడించగలిగిందని వివరించారు. గెలవాలనే తపన, ఆత్మవిశ్వాసం భారత హాకీ ప్లేయర్లను సెమీ ఫైనల్‌కు చేరడానికి సహకరించిందని అన్నారు.
వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో దేశంలో కోవిడ్ 19 పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ నుంచి రికార్డు సంఖ్యలో అథ్లెట్లు టోక్యోకు తరలి వెళ్లారని వ్యాఖ్యానించారు. తొలి సారిగా పలు ఈవెంట్లల్లో భారత అథ్లెట్లు ముందంజ వేశారని ప్రశసించారు. భారత అథ్లెట్లు తమ తదుపరి మ్యాచులను చేరుకోవడమే కాకుండా.. ప్రత్యర్థులను ఆధిపత్యాన్ని ప్రదర్శించారని చెప్పుకొచ్చారు. క్రీడారంగంలో భారత్‌కు ముందుచూపు, దార్శనికతకు ఇది నిదర్శనంగా నిలిచిందని ప్రధాని అన్నారు. ఆత్మ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమేనని, గ్రామీణ స్థాయిలో టాలెంట్‌ను పసిగట్టి.. మరింత ప్రోత్సహం ఇస్తామని తెలిపారు.
సెమీ ఫైనల్స్‌లో ఓటమితో నిరాశకు లోనైన భారత హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్సాహాన్ని ఇచ్చారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఆయన టీమ్ కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ మెగా టోర్నమెంట్‌లో అన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని మోడీ వారికి సూచించారు. కాంస్య పతకాన్ని సాధించడానికి సర్వశక్తులను కూడగట్టుకోవాలని అన్నారు. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ- ధైర్యాన్ని కోల్పోవద్దని, తమదైన శైలిలో మ్యాచ్‌లో సత్తా చాటాలని, స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకోవాలని అకాంక్షించారు ప్రధాని మోడీ.
అంతకుముందు-నరేంద్ర మోడీ పురుషుల హాకీ జట్టు కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ మెగా టోర్నమెంట్‌లో అన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని మోడీ వారికి సూచించారు. కాంస్య పతకాన్ని సాధించడానికి సర్వశక్తులను కూడగట్టుకోవాలని అన్నారు. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ- ధైర్యాన్ని కోల్పోవద్దని, తమదైన శైలిలో మ్యాచ్‌లో సత్తా చాటాలని, స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకోవాలని అకాంక్షించారు ప్రధాని మోడీ.