
హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఐస్ డ్యాన్స్ ఈవెంట్‌లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన గాబ్రియెలా పాపడాకిస్, గిలామ్ సిజెరాన్ పోటీపడ్డారు.
మరిన్ని వింటర్ ఒలింపిక్స్ వార్తల కోసం
డ్యాన్స్ చేస్తున్న క్రమంలో 22 ఏళ్ల గాబ్రియెలా వేసుకున్న ఆకుపచ్చ డ్రెస్ ఒక్కసారిగా ఛాతి భాగం నుంచి కిందకు జారింది. దీంతో ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తోన్న టెలివిజన్ ఛానల్ లైవ్‌లో ఈ తతంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారమైంది. అయితే, ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆమె అంతలోనే తేరుకొని జారిన ఆ డ్రెస్‌ను సరిచేసుకుంది.
అయినా సరే ఈ జోడీ ఈ పోటీలో రెండో స్ధానంలో నిలవడం విశేషం. నిజానికి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోటీలో నిలిచిన వారు కాస్త తత్తరపాటుకు గురవుతారు. అయితే ఈ ఫ్రెంచ్ జోడీ మాత్రం ఏ మాత్రం తత్తరపాటుకు లోనుకాకుండా ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించింది.
దీంతో వీరిద్దరి ఆత్మవిశ్వాసానికి స్టేడియంలోని ప్రేక్షకులు అభినందించారు. ఈ వింటర్ ఒలింపిక్స్‌లో ఐస్ స్కేటింగ్ పోటీల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. ఇదే స్టేడియంలో అమెరికాకు చెందిన ఐస్ డ్యాన్సర్ యురా మిన్... తన పాట్నర్ అలెక్స్ గామ్లిన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె డ్రెస్ వెనుక భాగం జారిపోయింది.