దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానం సాధించాడు. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ గెలవడంలో రూట్ కీలకపాత్ర పోషించాడు.
అతను ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా 73.83 సగటుతో 443 పరుగులు చేశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టుకు ముందు మూడో ర్యాంకులో ఉన్న అతను.. టెస్టు ముగిశాక నెంబర్‌వన్‌గా అవతరించాడు.
ఏబి డివిలియర్స్, స్టీవెన్ స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 10వ స్థానంలో కొనసాగుతూ టాప్-10లో నిలిచాడు.

ఆస్ట్రేలియాపై సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ విభాగంలో ఐదో ర్యాంకు నుంచి రెండో ర్యాంకు సంపాదించాడు. డేల్ స్టెయిన్ టాప్ ర్యాంకులో ఉన్నాడు.
టాప్-10 రాంకింగ్స్‌లో కొనసాగుతున్న ఆటగాళ్లు
1. జో రూట్(ఇంగ్లాండ్) 917
2. ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) 890
3. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 884
4. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా) 881
5. కుమార సంగక్కర (శ్రీలంక) 874
6. ఏంజిలో మాథ్యూస్ (శ్రీలంక) 860
7. యూనిస్ ఖాన్(పాకిస్థాన్) 829
8. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) 813
9. క్రిస్ రోజర్స్ (ఆస్ట్రేలియా) 763
10. విరాట్ కోహ్లీ (ఇండియా) 755