నేను గేనే: ఆస్ట్రేలియా మేటి స్విమ్మర్ ఇయాన్ థోర్ప్
సిడ్నీ: ఆస్ట్రేలియా మేటి స్విమ్మర్, ఐదు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ఇయాన్ థోర్ప్ సంచలన ప్రకటన చేశాడు. తాను గే అని బహిరంగంగా అంగీకరించాడు. దీంతో అతని సెక్సువాలిటీపై ఎన్నాళ్లగానో సాగుతున్న చర్చకు తెరపడింది.
తాను గే కాదని ఎప్పటినుంచో చెబుతూ వచ్చిన థోర్ప్ ఇటీవల ఓ టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఎట్టకేలకు నోరు విప్పాడు. ఆ విషయం తనకూ ఈ మధ్యే స్పష్టంగా తెలిసిందని అన్నాడు. తాను సాధారణ వ్యక్తిని కాదని, రెండు వారాల క్రితమే తనకు నిజం తెలిసిందని, ఈ విషయాన్ని తాను సన్నిహితులందరికీ చెప్పాడనికి ఏమాత్రం సంకోచించలేదని అన్నాడు.

తన సెక్సువాలిటీ ఎమిటో ఎవరికీ తెలియకుండా ఉండేందుకు థోర్ప్ జాగ్రత్తపడుతూ వచ్చాడు. 2012లో వెలువడ్డ తన ఆత్మకథలోనూ తానో సాధారణ వ్యక్తినేనని చెప్పుకున్నాడు. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన సెక్సువాలిటీ గురించి మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారని, ఈ విషయంపై వారు తనను ఆత్మరక్షణలోకి నెట్టారని అన్నాడు.
ఆ సమయంలో తాను గేనో కాదో గుర్తించలేకపోయానని, తరగతిలో సహచరులు వేధిస్తారని తాను సాధారణ మనిషినేనని అబద్దం చెప్పానని అతను అన్నాడు. అతని సెక్సువాలిటీ గురించి మొదట ప్రశ్నించినప్పుడు ఇయాన్ థోర్ప్ వయస్సు 16 ఏళ్లు. అయితే, అప్పటి నుంచి ఆ ప్రశ్నను ఎప్పటికప్పుడు అతను ఎదుర్కుంటూనే ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications