భార్యలు, ప్రియురాళ్ల వల్ల ఆసీస్ ఓటమి, ఏడ్చిన క్లార్క్ భార్య
నాటింగ్ హామ్: యాషెస్ సిరీస్‌లో వైఫల్యానికీ ఆస్ట్రేలియా ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లకు లంకె పెట్టాడు ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలీ. ఆటగాళ్లు తమ వెంట ప్రేయసిని లేదా భార్యను వెంటేసుకుని పర్యటనకు రావడమే జట్టు ఘోరంగా విఫలమవ్వడానికి కారణమన్నాడు.
తనకు తెలిసి గొప్ప క్రికెటర్లెప్పుడూ ఇలా మ్యాచ్‌లకు తమ భాగస్వాములను వెంటేసుకుని వచ్చేవారు కాదన్నాడు. తమ దృష్టి మరలడం వాళ్లకు అసలు ఇష్టముండేది కాదన్నాడు. అప్పట్లో సిరీస్ గెలిచాక గానీ భాగస్వామితో కలిసుండటానికి ఆటగాళ్లను అనుమతించేవారు కాదన్నాడు.
కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ తమ భాగస్వాములను వెంట తెచ్చుకున్నారని, క్రికెట్ ఆడాలంటే చాలా శ్రద్ధ అవసరమని విమర్శించాడు. మనసు పూర్తిగా ఆట మీదే పెట్టాలని, తనకైతే వాళ్లలా చేసినట్లు కనిపించలేదని విమర్శలు గుప్పించాడు.

ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులోని 8మంది యాషెస్ తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడరని మాజీ సారథి పాంటింగ్ అన్నాడు. అందులో ఒకడు మైకేల్ క్లార్క్ అయ్యాడు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడి మధ్య నాలుగో టెస్టు ఆడిన క్లార్క్.. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా విఫలమవడంతో అస్త్రసన్యాసం చేశాడు.
తాను ఇంకో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడతానని, అంతటితో తన కెరీర్ ముగుస్తుందని, కుర్రాళ్లను మధ్యలో వదిలేసి వెళ్లలేనని, అందుకే యాషెస్‌లో చివరి టెస్టు కూడా ఆడతానని, రిటైర్మెంట్‌కు ఇది సరైన సమయమని, ఆటను వదిలేయాలని ఎవరూ కోరుకోరని, కానీ గత 12 నెలలుగా తన ప్రదర్శన సంతృప్తినివ్వట్లేదని, జట్టును ముందుండి నడిపించాలని కోరుకున్నానని, కానీ నిరాశపరిచానని, వన్డేల్లో ప్రపంచకప్ ఎలాగో టెస్టుల్లో మాకు యాషెస్ అలాగే అన్నాడు.
తన వంతుగా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రయత్నించానని, తన సహచరులూ అదే చేశారని, కానీ మేం చిత్తుగా ఓడిపోయామని, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. ఆస్ట్రేలియా తరఫున వంద టెస్టులు ఆడగలిగినందుకు అదృష్టవంతుణ్ని అన్నాడు. ఆటకు చాలా రుణపడి ఉంటానని చెప్పాడు. క్లార్క్ గుడ్ బై చెప్పడంతో ఆయన భార్య కైలీ క్లార్క్ విలపించారు.
2003లో వన్డేల్లో, తర్వాతి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్లార్క్ 114 టెస్టుల్లో 49.3 సగటుతో 8628 పరుగులు (28 శతకాలు), 245 వన్డేల్లో 44.58 సగటుతో 7981 పరుగులు (8 శతకాలు) చేశాడు. 2011లో రికీ నుంచి పగ్గాలు అందుకున్నాడు. ఆస్ట్రేలియా 46 టెస్టుల్లో నాయకత్వం వహించి 23 మ్యాచ్‌ల్లోవిజయాలందించిన క్లార్క్ 74 వన్డేల్లో 50 విజయాలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications