For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్‌కతా గర్జనకు ప్రేరణ ఇయాన్‌హుమ్‌

By Pratap

కోల్‌కతా: కష్ట సాధ్యమైన పరిస్థితుల్లో నేర్పుగా గోల్స్‌ చేయడం ఆయనకు కొట్టిన పిండి. ఆయనే కెనడాకు చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫ్రాంచైసీ అట్లెంటికో డీ కోల్‌కతా (ఎటికె) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టును సెమీస్‌కు చేర్చడంలోనూ ఇయాన్‌ హుమ్‌దే కీలక పాత్ర. కోల్‌కతా జట్టు అస్త్రాల ఆయుధాగారంగా నిలిచిన ఇయాన్‌ 2015 ఎడిషన్‌ ఐఎస్‌ఎల్‌ టోర్నీలో 11 గోల్స్‌తో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రత్యర్థి జట్లు బ్యాక్‌ లైన్‌ వరకూ స్వేచ్ఛగా దూసుకెళ్లగల సామర్థ్యం ఇయాన్‌ సొంతం.

లీసెస్టర్‌ సిటీ ఆటగాడైన ఇయాన్‌హుమ్‌.. పెద్ద పెద్ద మ్యాచ్‌ల్లోనూ జట్లును విజయ తీరం వైపు తీసుకెళ్ల సామర్థ్యం ఆయన సొంతం. 2015 ఎడిషన్‌ రెండోదశ సెమీస్‌లో చెన్నైయిన్‌ ఎఫ్‌సి చేతిలో ఓటమి పాలైనా ఆటలో తన ఉత్కృష్టతను కాపాడుకుంటూ ముందుకెళుతున్నాడు. హీరో ఐఎస్‌ఎల్‌ టోర్నీ మొత్తంలో ఎక్కువ గోల్స్‌ చేసిన క్రీడాకారుల్లో రెండోవాడు. ఐఎస్‌ఎల్‌లో 16 గోల్స్‌ ఉంటే తానొక్కడే 11 గోల్స్‌ చేసిన ఘనత ఈయనదే.

తద్వారా అట్లెంటిక్‌ డీ కోల్‌కతా సారధి హెల్డర్‌ పోస్టిగ, సమీగ్‌ డౌటీల మాదిరిగానే ఇయాన్‌హుమ్‌ కూడా కోల్‌కతా జట్టుకు జట్టు డ్రైవింగ్‌ ఫోర్స్‌లో ఒకరు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లోనూ తన స్కోర్‌ తక్కువేమీ ఉండబోదని విశ్వాసం వ్యక్తంచేస్తున్నాడు.

Iain Hume: Atlético de Kolkata’s thundering force

2014లో ఐఎస్‌ఎల్‌ ప్రారంభ ఎడిషన్‌లో కేరళ బ్లాక్‌బస్టర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇయాన్‌ హుమ్‌ స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో 1983లో జన్మించాడు. 1999లో ట్రాంమీర్‌ రోవర్స్‌లో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఇయాన్‌హుమ్‌ ఆరేళ్ళ తర్వాత ఐదు లక్షల పౌండ్ల ఫీజుకోసం లీసెస్టర్‌ సిటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. మూడేళ్లకు బార్నెస్లేతో 12 లక్షల ఫౌండ్లకు ఒప్పందంపై సంతకం చేసిన ఇయాన్‌హుమ్‌కు షీఫీల్డ్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తలకు గాయమైంది.

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించినా హుమ్‌ క్రీడా జీవితమంతా కెనడాలో సాగింది. కెనడా తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహించిన ఇయాన్‌.. లివర్‌ పూల్‌, హర్ట్స్‌కు మద్దతుదారు. చిన్నతనంలోనే ఇయాన్‌రాష్‌, జాన్‌ బేర్న్స్‌ భావాలకు అంకితమైన ఇయాన్‌ హుమ్‌ 1999లో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా కెరీర్‌ ప్రారంభించినా 2000 ఏప్రిల్‌ 15వ తేదీన గానీ స్వీడన్‌ టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా అడుగు పెట్టలేక పోయాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే కెరీర్‌ ప్రారంభించిన ట్రాంమీర్‌ రోవర్స్‌లో 2004 - 05లోనే ఎకాఎకీన 16 గోల్స్‌ చేసిన ఘనత ఈయనకే సొంతం. లీగ్‌ 1, లీగ్‌ 2లను విజయవంతంగా గెలుచుకున్నా నేపథ్యం కూడా ఇయాన్‌ హుమ్‌దే.

బార్సిలోనా ఎఫ్‌సితో సెరిగో బస్క్వెట్స్‌ కాంట్రాక్ట్‌

స్పెయిన్‌ ఇంటర్నేషనల్‌ మిడ్‌ ఫీల్డర్‌ సెరిగో బస్క్వెట్స్‌ 2021 జూన్‌ వరకు బార్సిలోనా ఎఫ్‌సి క్లబ్‌ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ తర్వాత మరో రెండేండ్లు తన కాంట్రాక్ట్‌ పొడిగించాలన్న నిబంధనతో సెరిగో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. బార్సిలోనా క్లబ్‌ ఆడిన 390 మ్యాచ్‌ల్లో 250 లీగ్‌ మ్యాచ్‌ల్లో సెరిగో బస్క్వెట్స్‌ భాగస్వామ్యం ఉందంటే అతిశేయోక్తి కాదు. ఈ కాలంలో లా లీగా టోర్నీ టైటిల్‌ను ఆరుసార్లు, చాంపియన్‌ లీగ్‌ టోర్నీ టైటిల్‌ను మూడుసార్లు బార్సిలోనా ఎఫ్‌సి గెలుచుకున్నది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+