ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు పిళ్లై జబీర్, నిరాశపరిచిన శ్రీశంకర్

హైదరాబాద్: దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తొలిరోజు భారత్ కాస్త మిశ్రమంగా ప్రారంభించింది. కచ్చితంగా ఫైనల్ చేరే అవకాశం ఉందని భావించిన లాంగ్ జంపర్ శ్రీ శంకర్ క్వాలిఫికేషన్లోనే ఇంటిముఖం పట్టగా... 400మీటర్ల హర్డిల్స్‌లో మదారి పిళ్లై జబీర్ ముందంజ వేశాడు.
కేరళకు చెందిన 20 ఏళ్ల లాంగ్ జంపర్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో తొలి ప్రయత్నంలో 7.52 మీటర్లు మాత్రమే దూకాడు. రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62 మీటర్లు నమోదు చేశాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఫౌల్‌గా వెనుదిరిగాడు. మొత్తం మీద 17వ స్థానంతో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు.

ఫైనల్‌కు అర్హత సాధించాలంటే
మొత్తం మీద ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్-12లో చోటు దక్కించుకోవాలి. లేదంటే నిర్దేశిత ప్రమాణం 8.15మీ. జంప్ చేయాలి. ఈ రెండూ జరగపోవడంతో అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 8.20 మీటర్ల జాతీయ రికార్డు ఖాతాలో ఉన్న శంకర్.. తన స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శన చేయలేకపోవడం నిరాశను కలిగించింది.

అగ్రస్థానంలో నిలిచిన జువాన్ ఇచెవారియా
జువాన్ ఇచెవారియా (క్యూబా) 8.40 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలవగా, జెఫ్ హెండర్సన్ (అమెరికా, 8.12 మీ) రెండోస్థానంలో నిలవగా, యుకి హిషికా (జపాన్, 8.07 మీ) మూడో స్థానంలో నిలిచారు. ఇక, పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొన్న జబీర్ మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను 49.62 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు.

హీట్స్‌లోనే వెనుదిరిగిన అయ్యసామి
ఈ హీట్‌లో నార్వే స్టార్ వార్‌హోమ్ (49.27 సె) అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత ఆటగాడు ధరుణ్ అయ్యసామి హీట్స్‌లోనే వెనుదిరిగాడు. హీట్-5లో ధరుణ్ 50.93 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... ఎనిమిది మంది పాల్గొన్న హీట్స్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత పొందుతారు.

100మీటర్ల మహిళల హీట్స్‌లో ద్యుతీచంద్
ఇదిలా ఉంటే, శనివారం జరిగే పోటీల్లో భారత్ నుంచి 100మీటర్ల మహిళల హీట్స్‌లో ద్యుతీచంద్, పురుషుల 400మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో జబీర్... పురుషుల 4*400మీటర్ల మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో భారత జట్టు బరిలో దిగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications